T20 World Cup 2024 South Africa Finishers: ఆస్ట్రేలియా కాదు.. వరల్డ్ కప్ టీమ్స్​కు సౌతాఫ్రికా భయం! ఫినిషర్లుగా ఆ ఇద్దరు రాక్షసులు!

ఆస్ట్రేలియా కాదు.. వరల్డ్ కప్ టీమ్స్​కు సౌతాఫ్రికా భయం! ఫినిషర్లుగా ఆ ఇద్దరు రాక్షసులు!

వరల్డ్ కప్ అనగానే అందరూ ఆస్ట్రేలియాను చూసి భయపెడతారు. కానీ త్వరలో జరిగే పొట్టి ప్రపంచ కప్పులో ఆ టీమ్​ కంటే కూడా సౌతాఫ్రికా మరింత డేంజరస్​గా కనిపిస్తోంది. ప్రొటీస్ ఫినిషర్ల గురించి తెలిస్తే భయపడకుండా ఉండలేరు.

వరల్డ్ కప్ అనగానే అందరూ ఆస్ట్రేలియాను చూసి భయపెడతారు. కానీ త్వరలో జరిగే పొట్టి ప్రపంచ కప్పులో ఆ టీమ్​ కంటే కూడా సౌతాఫ్రికా మరింత డేంజరస్​గా కనిపిస్తోంది. ప్రొటీస్ ఫినిషర్ల గురించి తెలిస్తే భయపడకుండా ఉండలేరు.

వరల్డ్ కప్ వస్తోందంటే చాలు.. అందరూ తొలుత ఆస్ట్రేలియా గురించే మాట్లాడతారు. గత మూడు దశాబ్దాలుగా వరల్డ్ క్రికెట్​ను ఏలుతోంది ఆసీస్. ఆ జట్టు ఫార్మాట్​తో సంబంధం లేకుండా అన్నింటా హవా చలాయిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ కప్ లాంటి మేజర్ ఐసీసీ టోర్నీల్లో ఆ టీమ్​కు సూపర్ రికార్డు ఉంది. సెమీస్ వరకు వచ్చిందా.. కప్పు కొట్టే వెళ్లడం ఆసీస్​కు అలవాటుగా మారింది. గతేడాది వన్డే వరల్డ్ కప్​లో కూడా మొదట్లో వరుస ఓటములతో డీలాపడ్డట్లు కనిపించిన కమిన్స్ సేన.. ఆ తర్వాత తేరుకొని కప్పు ఎగరేసుకుపోయింది. త్వరలో జరిగే టీ20 ప్రపంచ కప్​లో కూడా ఆ టీమే ఫేవరెట్​గా కనిపిస్తోంది. అయితే ఆసీస్ కాదు.. ఇప్పుడు అందరూ సౌతాఫ్రికాను చూసి భయపడుతున్నారు.

సౌతాఫ్రికా అటు బ్యాటింగ్​తో పాటు ఇటు బౌలింగ్​లోనూ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే వరల్డ్ కప్ కోసం ఆ జట్టు మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు రాక్షసులను ఫినిషర్లుగా దింపనున్నట్లు సమాచారం. వాళ్లిద్దరూ అలాంటి ఇలాంటి హిట్టర్లు కాదు. బరిలోకి దిగిందే ఆలస్యం ఫస్ట్ బాల్ నుంచే విధ్వంసం సృష్టిస్తారు. ఫోర్లు, సిక్సులతో బౌలర్లపై విరుచుకుపడటం అంటే వాళ్లకో సరదా. మ్యాచ్ సిచ్యువేషన్, గెలుపోటములు, పిచ్ ప్రవర్తిస్తున్న తీరు వంటి అంశాల్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోరు. బాల్ వచ్చింది, కొట్టాం.. వాళ్ల లెక్కంతే. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. ఒకరు విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి హెన్రిచ్ క్లాసెన్ అయితే, మరొకరు హిట్టింగ్​కు న్యూ డెఫినిషన్ చెబుతున్న ట్రిస్టన్ స్టబ్స్.

టీ20 వరల్డ్ కప్​లో క్లాసెన్-స్టబ్స్ జోడీని ఆఖరి ఓవర్లలో ఆడించాలని, వీళ్లను ప్రధాన అస్త్రంగా బరిలోకి దింపాలని ప్రొటీస్ మేనేజ్​మెంట్ భావిస్తోందట. ఇదే విషయం మీద టీమిండియా మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ రియాక్ట్ అయ్యాడు. క్లాసెన్-స్టబ్స్ చివరి 5 ఓవర్లలో బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థుల పని ఫినిష్ అని అన్నాడు. వాళ్లిద్దరూ డెత్ ఓవర్లలో క్రీజులో ఉన్నారనే ఊహే చాలా భయంకరంగా ఉందన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్​లో క్లాసెన్ 186 స్ట్రైక్ రేట్​తో 339 పరుగులు చేశాడు. అదే స్టబ్స్ 188 స్ట్రైక్ రేట్​తో 318 రన్స్ చేశాడు. బౌలర్లను ఊచకోత కోసే వీళ్లిద్దర్నీ ఆపడం అంత ఈజీ కాదు. ఈ ముప్పును అపోజిషన్ టీమ్స్ ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. మరి.. క్లాసెన్-స్టబ్స్ వరల్డ్ కప్ మెరుపుల్ని చూసేందుకు మీరెంతగా ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments