Video: 78 ఏళ్ల ఈమెను చూస్తే ఓటు విలువ తెలుస్తుంది! అంబులెన్స్ లో వెళ్లి..

Video: 78 ఏళ్ల ఈమెను చూస్తే ఓటు విలువ తెలుస్తుంది! అంబులెన్స్ లో వెళ్లి..

మన తలరాతలను , భవిష్యత్ ను నిర్ణయించేది మన ఉపయోగించే ఓటు. అయితే నేటి కాలంలో కొందరి యువతలో ఓటుపై చిన్న చూపు ఏర్పడింది. 78 ఏళ్ల వృద్దురాలు ఓటు విషయంలో నిర్లక్ష్యంగా ఉండే వారికి కనువిప్పు కలిగించేలా చేసింది.

మన తలరాతలను , భవిష్యత్ ను నిర్ణయించేది మన ఉపయోగించే ఓటు. అయితే నేటి కాలంలో కొందరి యువతలో ఓటుపై చిన్న చూపు ఏర్పడింది. 78 ఏళ్ల వృద్దురాలు ఓటు విషయంలో నిర్లక్ష్యంగా ఉండే వారికి కనువిప్పు కలిగించేలా చేసింది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైనది. అలానే ఇది ప్రతి పౌరుడికి వజ్రాయుధం. ఆధునిక ఎన్నికల  భారతంలో ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలి. మన తలరాతలను , భవిష్యత్ ను నిర్ణయించేది మన ఉపయోగించే ఓటు. అయితే నేటి కాలంలో కొందరి యువతలో ఓటుపై చిన్న చూపు ఏర్పడింది. మనం వెయ్యకుంటే ఏం నష్టం అనే భావనలో ఉన్నారు. అలానే యువత నిర్లిప్తత  ప్రదర్శిస్తే.. అయిదేవళ్ల వరకు మళ్లీ ఈ అపురూప అవకాశంచేతికి దక్కదు. ఇలా ఓటుపై కొందరి ధోరణి నిర్లక్ష్యంగా ఉంటే.. ఓ 78 ఏళ్ల బామ్మ చేసిన పని చూస్తే ఓటు విలువ తెలుస్తుంది. తాను ఆస్పత్రిలో బెడ్ పై ఉండి కూడా ఓటు హక్కును వినియోగించుకుని నలుగురు ఆదర్శంగా నిలిచింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. శుక్రవారం రెండో విడత పోలింగ్ కూడా ముగిసింది. మొత్తం ఏడు విడుతల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు విడుతల్లో పోలింగ్ ముగిసింది. ఇదే సమయంలో ఇక ఓటింగ్ శాతాన్ని పెంచేందు ఎన్నికల అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఓటుకు ఎంతంటి విలువ ఉందో ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు.. ఎన్నికల పోలింగ్ రోజున ఉద్యోగులకు హాలిడేస్ ను ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ కొందరు మాత్రం ఓటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఓటు విషయంలో నిర్లక్ష్యంగా ఉండే వారికి కనువిప్పు కలిగించేలా కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళురుకు చెందిన కళావతి అనే 78 ఏళ్ల  వృద్ధురాలు పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసింది. అందులో గొప్పేముందు అని మీకు అనిపించవచ్చు. 78 ఏళ్ల వృద్ధురాలు ఓటు వినియోగించుకోవడానికి రావడమే గ్రేట్ అయితే.. అది కూడా అబులెన్స్ లో వచ్చి మరి.. ఓటు వెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ బామ్మను చూస్తే.. ఓటు విలువ తెలుస్తుందని ఈ సంఘటన చూసిన వారు చెబుతున్నారు.

ఆ 78 ఏళ్ల బామ్మ న్యుమోనియాతో బాధ పడుతున్నప్పటికీ.. ఆక్సిజన్ పెట్టుకుని అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రం వద్దుకు  వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది. శుక్రవారం బెంగళూరులో పోలింగ్ జరగ్గా.. ఆక్సిజన్‌ మాస్క్ పెట్టుకుని అంబులెన్సులో పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి.. తన ఓటు హక్కును వినియోగించుకుంది. అనంతరం తిరిగి ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవలే ఆమె శ్వాస ఆడకపోవడం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న మణిపాల్‌ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు.

ఇంత అస్వస్థతకు గురైన కళావతి.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పట్టుబట్టారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు డాక్టర్లతో చెప్పడంతో వారు అన్ని ఏర్పాట్లు చేశారు. కళావతిని జయానగర్‌లోని పోలింగ్‌ కేంద్రానికి అంబులెన్సులో.. ఆక్సిజన్ మాస్క్‌ పెట్టి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో లేవలేని స్థితిలో ఉండి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్న  ఆ వృద్ధురాలి విషయం తెలిసి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ బామ్మను చూసైనా.. ఇంట్లో కూర్చున్న వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయాలని ప్రజ్యాస్వామ్య పరిరక్షణ వాదులు సూచిస్తున్నారు.

Show comments