వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

YSR Kadapa YSRCP Candidates List: వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

YSR Kadapa District YSRCP Candidates Names List Constituency Wise: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ.

YSR Kadapa District YSRCP Candidates Names List Constituency Wise: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ.

ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది వైఎస్ఆర్ సీపీ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామా సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. ఐదు స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారు.  మాల, ముస్లిం సామాజికవర్గాలకు ఒక్కో సీటు కేటాయించారు.

వైఎస్ఆర్ కడప:

  • పులివెందుల- వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి- రెడ్డి
  • కమలాపురం- పి. రవీంద్రనాథ్ రెడ్డి- రెడ్డి
  • జమ్మలమడుగు- ఎం. సుధీర్ రెడ్డి- రెడ్డి
  • ప్రొద్దుటూరు- రాచమల్లు శివప్రసాద్ రెడ్డి- రెడ్డి
  • మైదుకూరు- ఎస్. రఘురామిరెడ్డి- రెడ్డి
  • బద్వేల్- డాక్టర్ దాసరి సుధ- మాల
  • కడప- అంజద్ బాషా- ముస్లిం
Show comments