IPL 2024 SRH Revenge On Harshit Rana: ప్లేఆఫ్స్​లోకి SRH.. అవమానించిన ఆ బౌలర్ బలుపు తీర్చడానికి టీమ్ అంతా కసిగా!

ప్లేఆఫ్స్​లోకి SRH.. అవమానించిన ఆ బౌలర్ బలుపు తీర్చడానికి టీమ్ అంతా కసిగా!

ప్లేఆఫ్స్​లోకి ఎంట్రీ ఇచ్చింది సన్​రైజర్స్ హైదరాబాద్. ఈసారి కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్న కమిన్స్ సేన.. టైటిల్​కు కొద్ది దూరంలో ఉంది.

ప్లేఆఫ్స్​లోకి ఎంట్రీ ఇచ్చింది సన్​రైజర్స్ హైదరాబాద్. ఈసారి కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్న కమిన్స్ సేన.. టైటిల్​కు కొద్ది దూరంలో ఉంది.

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. తప్పక గెలవాల్సిన సిచ్యువేషన్​లో ఉన్న సన్​రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడకుండానే నెక్స్ట్ స్టేజ్​కు చేరుకుంది. వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. 15 పాయింట్లతో ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయింది. ఇప్పటికే కోల్​కతా నైట్ రైడర్స్​తో పాటు రాజస్థాన్ రాయల్స్​ ప్లేఆఫ్స్​కు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో మరో టీమ్​కు మాత్రమే 16 పాయింట్లు సాధించే ఛాన్స్ ఉండటంతో ఎస్​ఆర్​హెచ్​ మూడో జట్టుగా ప్లేఆఫ్స్​లోకి ఎంట్రీ ఇచ్చింది. గత మూడు సీజన్లలోనూ నిరాశపర్చిన ఆరెంజ్ ఆర్మీ.. 2020 తర్వాత ఫస్ట్ టైమ్ ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయింది. ఇప్పుడు ఆ జట్టు కసి మీద ఉంది.

గ్రూప్ స్టేజ్​లో తమను అవమానించిన ఆ బౌలర్ మీద కోపంతో రగిలిపోతోంది సన్​రైజర్స్. అతడి బలుపు తీయాలని భావిస్తోంది. ప్లేఆఫ్స్​లో అతడ్ని ఓ ఆటాడుకోవాలని చూస్తోంది. దొరికితే వీరబాదుడుతో మూడు చెరువుల నీళ్లు తాగించాలని చూస్తోంది. ఎస్​ఆర్​హెచ్​ రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటోంది మరెవరి మీదో కాదు.. కోల్​కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణా పైనే. ఈ సీజన్ ఆరంభంలో కేకేఆర్​తో మ్యాచ్​లో పోరాడి ఓడింది కమిన్స్ సేన. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్​లో 3 వికెట్లు తీసిన హర్షిత్.. ఎస్​ఆర్​హెచ్​ను అవమానించాడు. మయాంక్ అగర్వాల్​ను ఔట్ చేశాక సన్​రైజర్స్ డగౌట్ వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్​లు ఇచ్చాడు. దీంతో మయాంక్ అతడ్ని సీరియస్​గా చూస్తూ వెళ్లిపోయాడు.

హర్షిత్ మీద అప్పటి నుంచి కోపంతో రగిలిపోతోంది ఎస్​ఆర్​హెచ్ క్యాంప్. అతడి బలుపు తీయాలని ఫిక్స్ అయింది. హర్షిత్​పై కసిగా ఉన్న సన్​రైజర్స్ బ్యాటర్లు.. అతడు బౌలింగ్​కు వస్తే చావు మోత మోగించాలని చూస్తున్నారు. ఫోర్లు, సిక్సులతో అతడికి పీడకల ఎలా ఉంటుందో పరిచయం చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆరెంజ్ ఆర్మీ రివేంజ్ తీరాలంటే ఒకటి జరగాలి. ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయిన ఎస్​ఆర్​హెచ్​ టాప్​-2తో లీగ్ స్టేజ్​ను ఫినిష్ చేయాలి. అందుకోసం ఆఖరి మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​పై నెగ్గాలి. అప్పుడు 17 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకుతుంది. అదే టైమ్​లో కేకేఆర్​తో మ్యాచ్​లో రాజస్థాన్ ఓడిపోవాలి. ఈ రెండూ జరిగితే ఎస్​ఆర్​హెచ్ టాప్​-2లో ఫినిష్ చేస్తుంది. అప్పుడు తొలి క్వాలిఫయర్​లో కోల్​కతాను ఢీకొనొచ్చు. ఆ మ్యాచ్​లో హర్షిత్​ బలుపు తీయొచ్చు. మరి.. సన్​రైజర్స్ తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

Show comments