నేడు మూడో విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ

నేడు మూడో విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ సంక్షేమ పాలనను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేసిన వైఎస్‌ జగన్‌.. ప్రతి ఏడాది ఆయా పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తూ సంక్షేమ పాలనలో సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. సంక్షేమ పథకాలలో భాగంగా ఈ రోజు జగన్‌ సర్కార్‌ పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయనుంది. సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాలకు ఆ మొత్తాన్ని తిరిగి జగన్‌ సర్కార్‌ చెల్లిస్తోంది.

వైఎస్సార్‌ సున్నావడ్డీ పేరుతో అమలుచేస్తున్న ఈ పథకం మూడో ఏడాది విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఏపీలోని 9.76 లక్షల పొదుపు సంఘాలలోని 1.02 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందుతున్నారు. సున్నా వడ్డీ కింద ఈ ఏడాది ఆయా సంఘాలలోని మహిళలు 1,261 కోట్ల రూపాయల లబ్ధి పొందబోతున్నారు. ఈ సొమ్మును సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు ప్రకాశం జిల్లాకేంద్రం ఒంగోలులో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయబోతున్నారు.

వరుసగా మూడో ఏడాది ఈ పథకాన్ని సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు. జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఈ పథకాన్ని అమలు చేసింది. మొత్తంగా మూడు ఏడాదుల్లో వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద పొదుపు సంఘాల మహిళలకు 3,615 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది.

పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ కింద ప్రతి ఏడాది 25 వేల కోట్ల రుణాలు అందించడమే కాకుండా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2019 ఏప్రిల్‌ 11వ తేదీ వరకు ఉన్న పొదుపు సంఘాల రుణాలు 26 వేల కోట్ల రూపాయలను జగన్‌వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. వైఎస్సార్‌ ఆసరా పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం ఇప్పటికే అమలులో ఉంది. మొత్తం 26 వేల కోట్ల రూపాయల రుణాలను నాలుగు విడతల్లో పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. రుణాలు చెల్లించాలని, ఎవరూ ఆపవద్దని చెప్పిన జగన్‌.. ఏప్రిల్‌ 11వ తేదీని కటాఫ్‌గా పెట్టి.. అప్పటి వరకు ఉన్న రుణం సొమ్మును అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వారికి ఇస్తున్నారు.

Show comments