RCB vs CSK Faf Du Plessis Run Out: డుప్లెసిస్ రనౌట్​పై వివాదం.. క్రీజులో బ్యాట్ పెట్టినా ఎందుకు ఔట్ ఇచ్చారు?

RCB vs CSK: డుప్లెసిస్ రనౌట్​పై వివాదం.. క్రీజులో బ్యాట్ పెట్టినా ఎందుకు ఔట్ ఇచ్చారు?

సీఎస్​కేతో నాకౌట్ మ్యాచ్​లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ రనౌట్ అయ్యాడు. క్రీజులో బ్యాట్ పెట్టినా అతడ్ని ఔట్​గా ప్రకటించారు. థర్డ్ అంపైర్ ఇలా అనౌన్స్ చేయడం వెనుక ఓ కారణం ఉంది.

సీఎస్​కేతో నాకౌట్ మ్యాచ్​లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ రనౌట్ అయ్యాడు. క్రీజులో బ్యాట్ పెట్టినా అతడ్ని ఔట్​గా ప్రకటించారు. థర్డ్ అంపైర్ ఇలా అనౌన్స్ చేయడం వెనుక ఓ కారణం ఉంది.

ప్లేఆఫ్స్​ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్​లో పంజా విసిరాడు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్. చెన్నై సూపర్ కింగ్స్​తో జరుగుతున్న పోరులో 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. 3 బౌండరీలు, 3 సిక్సులతో ఆకట్టుకున్నాడు. వర్షం వల్ల కాసేపు మ్యాచ్​ ఆగిపోయింది. మ్యాచ్ తిరిగి స్టార్ట్ అయ్యాక బాల్ విపరీతంగా టర్న్ అయింది. పిచ్ మీద పడ్డాక బంతి నెమ్మదిగా రావడం మొదలైంది. స్పిన్నర్లు తీక్షణ, జడేజా, శాంట్నర్ బౌలింగ్​లో షాట్లు కొట్టడం కష్టంగా మారింది. అయినా డుప్లెసిస్ మాత్రం పట్టుదలతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అతడు వివాదాస్పద రీతిలో క్రీజును వీడాడు.

శాంట్నర్ వేసిన 12వ ఓవర్​ చివరి బంతిని రజత్ పాటిదార్ స్ట్రయిట్ షాట్ కొట్టాడు. ఆ బాల్​ను ఆపేందుకు శాంట్నర్ ప్రయత్నించాడు. బంతి కాస్తా అతడి చేతులకు తగిలి దిశను మార్చుకొని వికెట్లను గిరాటేసింది. అయితే డుప్లెసిస్ క్రీజుకు దగ్గర్లో ఉండటంతో అది నాటౌట్ అని అంతా అనుకున్నారు. రీప్లేలో కూడా బ్యాట్ క్రీజులో పెట్టినట్లే కనిపించింది. దీంతో డుప్లెసిస్ కూడా నాటౌట్ అనుకొని నెక్స్ట్ బాల్ కోసం రెడీ అయ్యాడు. కానీ ఆలస్యంగా నిర్ణయాన్ని ప్రకటించిన థర్డ్ అంపైర్ అది ఔట్ అని తేల్చాడు. బాల్ వికెట్లను తగిలిన సమయంలో డుప్లెసిస్ బ్యాట్ క్రీజులోనే ఉన్నా అది గ్రౌండ్​ను టచ్ చేయలేదని, గాల్లో ఉందని.. అందుకే ఔట్ అంటూ అనౌన్స్ చేశాడు. దీంతో డుప్లెసిస్ సహా ఆర్సీబీ అభిమానులు షాకయ్యారు. మంచి ఇన్నింగ్స్ ఆడాక బాధతో క్రీజును వీడాడు డుప్లెసిస్. మరి.. ఈ రనౌట్​పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments