Virat Kohli: DCతో మ్యాచ్.. చరిత్ర సృష్టించనున్న కోహ్లీ! ఈ రికార్డ్ బద్దలు కొట్టే మెునగాడు పుట్టడేమో?

Virat Kohli: DCతో మ్యాచ్.. చరిత్ర సృష్టించనున్న కోహ్లీ! ఈ రికార్డ్ బద్దలు కొట్టే మెునగాడు పుట్టడేమో?

ఢిల్లీతో జరిగే మ్యాచ్ ద్వారా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. బహుశా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే మెునగాడు పుట్టడేమో అంటే అతిశయోక్తికాదు.

ఢిల్లీతో జరిగే మ్యాచ్ ద్వారా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. బహుశా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే మెునగాడు పుట్టడేమో అంటే అతిశయోక్తికాదు.

విరాట్ కోహ్లీ.. రన్ మెషిన్, రికార్డుల రారాజు, కింగ్ ఆఫ్ వరల్డ్ క్రికెట్.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేర్లు. ఇక ఈ ఐపీఎల్ లో పరుగులు సునామీ సృష్టిస్తున్నాడు కింగ్ కోహ్లీ. దాదాపు ప్రతిమ్యాచ్ లో రన్స్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. అయితే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు గానీ, తన అద్భుతమైన ఇన్నింగ్స్ లు మాత్రం జట్టు విజయానికి తొడ్పడకపోవడం ఒక్కటే ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కాగా.. ఆదివారం ఢిల్లీతో జరిగే మ్యాచ్ ద్వారా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు రన్ మెషిన్. బహుశా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే మెునగాడు పుట్టడేమో అంటే అతిశయోక్తికాదు. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా రన్ మెషిన్, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీతో ఆడే మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే ఎవ్వరూ సాధించని, సాధించలేని ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. అదేంటంటే? ఢిల్లీతో ఆడే మ్యాచ్ విరాట్ కోహ్లీకి 250వ ఐపీఎల్ మ్యాచ్. దాంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరఫున ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఏకైక ప్లేయర్ గా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.

ఇక ఈ జాబితాలో రెండో ప్లేస్ లో ఎంఎస్ ధోని(చెన్నై) ఆ తర్వాత వరసగా రోహిత్ శర్మ(ముంబై), సురేష్ రైనా(చెన్నై), సునీల్ నరైన్(కేకేఆర్) ఉన్నారు. కానీ వీరందరూ కోహ్లీకి ఆమడ దూరంలో ఉన్నారు. దాంతో కోహ్లీ నెలకొల్పే ఈ రికార్డ్ ను బద్దలు కొట్టే మెునగాడు లేడనే చెప్పాలి. కాగా.. రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభమైయ్యే ఈ మ్యాచ్ కు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ లో ఏ టీమ్ గెలిస్తే.. ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా మెరుగైతాయి. మరి కోహ్లీ సాధించబోయే ఈ అన్ బిలివబుల్ రికార్డ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments