Manisha Koirala-After Diagnosed With Cancer: తాగుడుకి బానిసనయ్యాను.. భయంకరమైన వ్యాధి.. అందరూ వదిలేశారు: హీరోయిన్

తాగుడుకి బానిసనయ్యాను.. భయంకరమైన వ్యాధి.. అందరూ వదిలేశారు: హీరోయిన్

Manisha Koirala: తాను కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులందరూ వదిలేశారని.. అప్పుడే తనకు మనుషులు ఎలా వాంటి వారో అర్థం అయ్యింది అంటుంది ఓ స్టార్ హీరోయిన్. ఆ వివరాలు..

Manisha Koirala: తాను కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులందరూ వదిలేశారని.. అప్పుడే తనకు మనుషులు ఎలా వాంటి వారో అర్థం అయ్యింది అంటుంది ఓ స్టార్ హీరోయిన్. ఆ వివరాలు..

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల లోకం. నేము, ఫేము ఉన్నవారినే ఇక్కడ పట్టించుకుంటారు. ఒక్కసారి ఫేడవుట్ అయ్యామా.. ఇక మన దరిదాపులకు కూడా ఎవరు రారు. ఈ రంగుల లోకంలో నిజమైన స్నేహం లభించడం ఎడారిలో నీటి కోసం వెతకడం లాంటిది. చేతి నిండా సినిమాలు ఉండి.. బాగా డబ్బులుంటే ప్రతి ఒక్కరు మన చుట్టూ తిరుగుతారు. వీటిల్లో ఏ ఒక్కటి తగ్గినా.. అంతవరకు మనల్ని పొగిడి.. మన కోసం ప్రాణం ఇస్తాను అన్న వారు పత్తా ఉండరు. తనకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది అంటున్నారు ఓ స్టార్ హీరోయిన్. తనకు భయంకరమైన జబ్బు వచ్చింది అని తేలడంతో.. ప్రతి ఒక్కరు తనను వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు..

మనీషా కొయిరాలా.. తెలుగు ప్రేక్షకులకు ఈ సీనియర్ హీరోయిన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. క్రిమినల్‌ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఒకే ఒక్కడు సినిమాలో తన అందం, అమాయకత్వంతో ప్రేక్షకులని కట్టి పడేసింది. ఈ చిత్రంలోని నెల్లూరి నెరజాణ.. పాట అప్పట్లో తెగ పాపురల్ అయ్యింది. అయితే ఈ బ్యూటీకి టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్‌లోనే ఎక్కువ అవకాశాలు రావడంతో.. అక్కడ స్టార్‌‌ హీరోయిన్‌గా రాణించింది. కెరీర్‌ పీక్స్ లో ఉన్న సమయంలో నేపాల్‌కు చెందిన సామ్రాట్‌ దహల్‌ను పెళ్లి చేసుకుంది. కానీ వివాహం అయిన పెళ్లయిన ఆరునెలలకే తాను ఆ బంధంలో కొనసాగలేనని ఆమెకు అర్థం అయ్యింది. ప్రేమంచిన భర్తే శత్రువుగా మారడంతో విడాకులు తీసుకోక తప్పలేదు.

తాగుడుకు బానిసయ్యాను..

ఓ వైపు వివాహ బంధం వైఫల్యం కావడం.. మరోవైపు బిజీ సినిమా షెడ్యూల్స్‌.. దాంతో తీవ్ర ఒత్తిడికి లోనై తాగుడుకు బానిసైంది మనీషా. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ బాధలు చాలదన్నట్లు 2012లో ఆమెకు క్యాన్సర్ అని తెలిసింది. మనీషా కొయిరాల అండాశయ క్యాన్సర్‌ బారిన పడింది. అప్పటి వరకు తనతో కలిసి ఉన్న స్నేహితులు.. అలాంటి కష్ట సమయంలో అండగా ఉండాల్సింది పోయి తమకు సంబంధం లేదన్నట్లు మనీషాను వదిలి వెళ్లిపోయారట.

ఒంటరిగా మిగిలాను..

ఈ పరిస్థితి గురించి మనీషా మాట్లాడుతూ.. ’జనాలకు ఎవరి బాధనూ పంచుకోవడం ఇష్టముండదు. కష్టాల్లో ఉన్నారనగానే వారిని ఒంటరిగా వదిలేసి పోతారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. నా స్నేహితులే కాదు బంధువులు ఎవరూ కూడా నాకు అండగా నిలబడలేదు. నేనెలా ఉన్నాను.. నా ఆరోగ్యం ఎలా ఉంది.. ఏంటనేది కూడా పట్టించుకోలేదు. అలాంటి క్లిష్ట సమయంలో కేవలం నా తల్లిదండ్రులు, సోదరుడు-వదిన.. వీళ్లు మాత్రమే నాకు మద్దతుగా నిలిచారు. అప్పుడే నాకు మనుషుల వ్యక్తిత్వాల గురించి బాగా అర్థం అయ్యింది‘ అని చెప్పుకొచ్చింది.

అందుకే ఇప్పుడింత స్ట్రాంగ్ అయ్యాను..

’నా జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను, కష్టాలను దాటుకుని వచ్చాను కాబట్టే ఈ రోజు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను. కేవలం నా కుటుంబం వల్లే ఈరోజు ఇలా మీ ముందు నిలబడగలిగాను‘ అని చెప్పుకొచ్చింది మనీషా కొయిరాల. రెండేళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడిన మనీషా 2014లో ఆ భయంకరమైన వ్యాధిని జయించింది. ఇటీవల హీరామండి అనే వెబ్‌ సిరీస్‌లో మల్లికా జాన్‌ అనే పాత్రలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Show comments