Wine Shops To Be Closed For 3 Days: మందుబాబులకు షాకింగ్ వార్త.. మూడ్రోజులు వైన్ షాపులు బంద్!

మందుబాబులకు షాకింగ్ వార్త.. మూడ్రోజులు వైన్ షాపులు బంద్!

Wine Shops To Be Closed For 3 Days: మందు బాబులకు మరో చేధు వార్త రానే వచ్చింది. మరోసారి రాష్ట్రంలో మద్యం దుకాణాలకు మూతపడనున్నాయి. అది కూడా ఏకంగా మూడ్రోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి.

Wine Shops To Be Closed For 3 Days: మందు బాబులకు మరో చేధు వార్త రానే వచ్చింది. మరోసారి రాష్ట్రంలో మద్యం దుకాణాలకు మూతపడనున్నాయి. అది కూడా ఏకంగా మూడ్రోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి.

మందుబాబులు ఎండ వేడిని చల్ల చల్లని బీర్లు తాగుతూ తట్టుకుంటున్నారు. ఎంతలా తాగేస్తున్నారు అంటే వైన్స్, బార్లు బయట బీర్ నో స్టాక్ అనే బోర్డులు పెట్టుకుంటున్నారు. మరీ.. ఇంతలా తాగేస్తున్నారా? అనే అనుమానం కూడా రాక మానదు. అయితే ఎండ వేడి కూడా అదే రేంజ్ లో ఉంటోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు చేరుతున్నాయి. ఈ రెండ్రోజులు అయితే వర్షం వచ్చి కాపాడింది. అయితే మందుబాబులకు రానున్న రోజుల్లో గట్టి షాకే తగల నుంది. ఎందుకంటే ఏకంగా మూడ్రోజులు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ముఖ్యంగా వరుసగా 48 గంటలు మద్య దుకాణాలు మూతపడతాయి.

మందుబాబులు, మద్యం ప్రియులకు ఇది చాలా చేధు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా మద్యం దుకాణాలు మూడ్రోజులపాటు మూతపడటం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా ఏక బిగిన 48 గంటలు మద్యం దుకాణాలు మూతపడే ఉండనున్నాయి. ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. మీరు అనుకున్నదే నిజం. తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మే 11 సాయంత్రం 6 గంటల నుంచి మళ్లీ మే 13న సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసే ఉంటాయి.

అంటే వరుసగా రెండ్రోజుల పాటు వైన్స్, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. ఈ వార్త తెలుసుకున్న మందుబాబులకు ఇప్పుడే వడదెబ్బ తగిలినట్లు అయ్యింది. అసలే బీర్లు దొరకడం లేదని రోడ్లెక్కి నినాదాలు చేస్తుంటే.. ఇప్పుడు రెండ్రోజులు రాష్ట్రంలో డ్రై డే నడవనుంది. ఈ వార్త తెలుసుకుని ఇప్పటి నుంచే డీలా పడిపోతున్నారు. ఇంక మూడో రోజు ఎప్పుడంటే.. మే 13న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపును జూన్ 4న నిర్వహించనున్నారు. ఆ రోజు ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో ఆ రోజున కూడా వైన్స్, మందు షాపులు అన్నీ మూత పడతాయి. ఇలా మొత్తం మూడ్రోజుల పాటు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడతాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా, భద్రత పరంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకే అధికారులు ఇలా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలను మూసేయాలని ఆదేశాలు జారీ చేస్తారు. మరి.. మూడ్రోజుల పాటు వైన్స్ బంద్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments