మొదటి రిస్క్ ఎవరు తీసుకుంటారు ?

మొదటి రిస్క్ ఎవరు తీసుకుంటారు ?

ఎప్పుడో తెలియదు. ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎప్పుడు ఏమవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా. థియేటర్ల ఓపెనింగ్ మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. జూన్ నుంచి అని కొందరు లేదు ఇంకో మూడు నెలలు ఆగాల్సిందే అని మరికొందరు ఇలా ఎవరికి తోచిన వెర్షన్లు వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. ప్రభుత్వాలకు మాత్రం సినిమా చివరి ఆప్షన్ గా నిలుస్తోంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఒక కంక్లూజన్ కు రావడం కష్టమే. కొన్ని నిబంధనలు, జాగ్రత్తలతో ఒకవేళ అనుమతులు దొరికినా అసలు ముందు ఎవరు రిక్స్ తీసుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది.

ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న సినిమాలు నాని వి, ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అరణ్య, ఉప్పెన, నిశబ్దం. ఒకవేళ పోస్టు ప్రొడక్షన్లు, షూటింగులకు అనుమతులు ఇస్తే ఓ ఇరవై రోజుల గ్యాప్ మరో అయిదారు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతాయి. కాని నిజంగా పబ్లిక్ మాల్స్ కు హాల్స్ కు వచ్చే మూడ్ లో ఉన్నారా అనేదే భేతాళ ప్రశ్న. ఎంత శానిటైజర్లు పెట్టి మాస్కులు ఉంటేనే లాంటి కండీషన్లు పెట్టినా ఫ్యామిలీలు, కుటుంబాలు అంత ఈజీగా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఓపెనింగ్స్ వీక్ గా వచ్చి టాక్ కూడా అంతంత మాత్రంగానే వస్తే ఇక అంతే సంగతులు. రెంటు కూడా గిట్టుబాటు కాదు. ఈ నేపధ్యంలో ఎవరో ఒకరు సాహసం చేసి ముందడుగు వేయక తప్పదు.

కాని ఆ ఎవరు అనేదే ఛాలెంజ్ గా మారింది. మరోవైపు ఓటిటి ప్రకంపనలు మొదలైపోయాయి. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ మొదలైంది. ఐనాక్స్ బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. దానికి ధీటుగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమాధానం చెప్పిన సంగతీ తెలిసిందే. ఎగ్జిబిషన్ భవిష్యత్తు ప్రస్తుతానికి అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడిలో ఉన్నారు. నిర్మాతలకు ఓటిటి ఛాయస్ ఉంది కాని వీళ్ళకు అదీ లేదు. ఒకవేళ ఓపిక నశించి వాళ్ళ పెట్టుబడులు వేరే రంగంలో పెడితే కనక ఇంకో కొత్త సంక్షోభం మొదలవుతుంది. సో థియేటర్లకు ఎప్పుడు అనుమతులు వచ్చినా ముందు ఎవరు రిస్క్ చేస్తారనేదే అందరి మదిలో మెదులుతున్న తీవ్రమైన ప్రశ్న.

Show comments