Gaami Movie Review & Rating in Telugu: విశ్వక్ సేన్ గామి మూవీ రివ్యూ

Gaami Movie Review: గామి మూవీ రివ్యూ

Gaami Movie Review & Rating in Telugu: ఎంతో స్పెషల్‌ క్యారెక్టర్‌ లుక్‌లో విశ్వక్‌సేన్‌ నటించిన గామి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఎంత మేర మెప్పించగలదో ఇప్పుడు రివ్యూలో చూద్దాం..

Gaami Movie Review & Rating in Telugu: ఎంతో స్పెషల్‌ క్యారెక్టర్‌ లుక్‌లో విశ్వక్‌సేన్‌ నటించిన గామి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఎంత మేర మెప్పించగలదో ఇప్పుడు రివ్యూలో చూద్దాం..

గామి

20240308, A
ఎపిక్ అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్
  • నటినటులు: విశ్వక్‌ సేన్‌, చాందిని చౌదరి, అభినయ
  • దర్శకత్వం: విద్యాధర్ కాగిత
  • నిర్మాత: కార్తీక్ శబరీష్
  • సంగీతం: నరేష్ కుమారన్, స్వీకర్ అగస్తి
  • సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి, రాంపి నందిగాం

2.75

గామి.. కేవలం టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన సినిమా ఇది. 2018లో పట్టాల మీదకి వెళ్లిన ఈ మూవీ.. బడ్జెట్ కారణాల వల్ల ఆగుతూ ఆగుతూ వచ్చి.. 6 ఏళ్ళ తరువాత ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. గామి రిజల్ట్ ఏంటి? ప్రేక్షకులను మెప్పించే రేంజ్ లో ఉందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

శంకర్ (విశ్వక్ సేన్) మనుషులకి దూరంగా ఓ అఘోర ఆశ్రమంలో జీవిస్తూ ఉంటాడు. అతనికి హ్యూమన్ టచ్(మనిషి స్పర్శ) పడదు. అయితే.., అఘోరాలు అంతా అది శివుడి శాపం అని, శంకర్ ఆశ్రమంలో ఉంటే మంచిది కాదని అతన్ని ఆశ్రమం నుండి బయటకి పంపించేస్తారు. తనని 15 ఏళ్ళ క్రితం ఆ ఆశ్రమంలో వదిలేసిన కేదార్ బాబాని వెతుక్కుంటూ ప్రయగ్ రాజ్ చేరుకుంటాడు శంకర్. తన వివరాలు తెలిసిన కేదార్ బాబా అప్పటికే చనిపోయి ఉంటాడు. అయితే.., ఆయన పొతూపోతూ శంకర్ సమస్యకి సమాధానంగా త్రివేణి పర్వతాల్లోని మాలి పత్రాల గురించి వివరాలు పొందుపరిచి కన్నుమూస్తాడు. కేదార్‌ బాబా శిష్యుడి నుండి ఆ వివరాలు తెలుసుకున్న శంకర్ మాలి పత్రాలని పొందాడా? లేదా? ఈ ప్రయాణంలో అతనికి జాన్వీ(చాందిని చౌదరి) ఎందుకు కలిసింది? చివరికి శంకర్ తనని తాను అన్వేషించుకొగలిగాడా? తన సమస్యకి పరిష్కారం కనుగొన్నాడా? లేదా? అన్నదే గామి కథ.

విశ్లేషణ:

గామి కోసం దర్శకుడు విద్యాధర్ కాగిత తన 6 ఏళ్ళ విలువైన సమయాన్ని కేటయించాడు. అతను ఈ కథని ఎంత నమ్ముంటే ఇంతటి సాహసం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన కథపై విద్యాధర్ కాగితకి ఉన్న నమ్మకం, ప్రేమే గామికి కొంత బలంగా మారితే, మరికొంత శాపంగా మారింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్, దీనికి అఘోరా బ్యాక్ డ్రాప్, అన్నింటికీ మించి.. విశ్వక్ సేన్ లాంటి సూపర్బ్ ఇంటెన్స్ ఉన్న స్టార్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్! ఓ సినిమా విజయానికి ఇంతకుమించి ఏమి కావాలి? గామిలో ఇవన్నీ ఉన్నా.. కథలో అనవసరపు లేయర్స్ ఎక్కువై స్క్రీన్ ప్లేని స్లో చేసేశాయి. ఇదంతా దర్శకుడికి తెలియకో, అర్థంకాకో, చేతకాకో జరిగిన తప్పిదం కాదు.  అతను ఆ స్క్రీన్ ప్లేని బలంగా నమ్మాడు అంతే.

ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ తెలుగు సినిమా ఇవ్వని సూపర్బ్ థ్రిల్‌తో గామి టేకాఫ్ జరిగింది. హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్, స్టోరీ బ్యాక్ డ్రాప్, కాంఫ్లిక్ట్ పాయింట్, అన్నీ మొదటి 15 నిమిషాల్లోనే జరిగిపోతాయి. దీంతో.. ఓ వండర్ క్రియేట్ చేయబోతున్న మూవీని చుస్తున్నామా అన్న ఫీల్ కలుగుతుంది. కానీ.., ఇక్కడ నుండి కథలో మరో లేయర్ వస్తుంది. అక్కడ నుండి మరో సబ్ లేయర్. ఈ మొత్తం సమయంలో శంకర్ పాత్ర తెరపై కనిపించదు. ఆడియన్స్ మాత్రం శంకర్ నెక్స్ట్ ఏం చేస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇలా మొత్తం సినిమా అంతా ఆడిటోరియం మూడ్ చెడిపోవడంతో గామి ట్రాక్ తప్పేసింది. కానీ.., శంకర్ జర్నీతో మాత్రం ఆడియన్స్ కంటిన్యూ అవుతూ వస్తారు. ఇదే గామికి పెద్ద ప్లస్

ఫస్ట్ ఆఫ్ లో శంకర్ జర్నీకి అడ్డుపడి.. స్క్రీన్ స్పేస్ తగ్గించేసిన పాత్రలు సెకండ్ ఆఫ్ లో కూడా కంటిన్యూ అవుతాయి. స్టోరీలో ఆ క్యారెక్టర్స్ కూడా భాగం కాబట్టి.. గామి స్క్రీన్ ప్లే ఇంకా ఇంకా స్లో అయిపోతూ వచ్చింది. అయితే.. విద్యాధర్ కాగిత డైరెక్షన్, విశ్వక్ యాక్టింగ్ కారణంగా శంకర్ క్యారెక్టర్ జర్నీ అప్పటికీ ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇక్కడ నుండి మిగతా లేయర్స్, అందులోని పాత్రలతో శంకర్ కి ఉన్న రిలేషన్ ఏంటో తెలిసిపోవడంతో గామి కొంతసేపు మెరుస్తుంది. అయితే.., అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో గామి ఓ సాధారణ స్థాయి సినిమాలా చప్పగా ముగిసింది.

నటీనటుల పనితీరు, టెక్నీకల్ విభాగం:

గామి దర్శకుడుని అందరికన్నా ఎక్కువగా నమ్మిన వ్యక్తి విశ్వక్ సేన్. విశ్వక్ యాక్టింగ్ లో ఇంటెన్స్ కనిపించింది. 6 ఏళ్ళ కృతం విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్  ఒప్పుకున్నప్పుడు అతను స్టార్ హీరో కాదు. గడిచిన ఈ 6 ఏళ్లలో విశ్వక్ ఎంత ఎదిగినా.. గామి కోసం తాను ఎన్ని చేయాలో, ఎంత చేయాలో అంతా చేశాడు. సో.. ఈ విషయంలో మాస్ కా దాస్ ని ఎంత పొగిడినా తప్పు లేదు. ఇక 6 ఏళ్లుగా ఇంతే కష్టపడ్డ మరో వ్యక్తి చాందిని చౌదరి. ఓ ఆడపిల్లగా ఈ సినిమా కోసం ఆమె పడ్డ కష్టం అభినందించదగిందే. ఇక టెక్నికల్‌గా చెప్పుకోవాల్సి వస్తే గామి మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా బీజీఎమ్ అదిరిపోయింది. ఇంత మంచి మ్యూజిక్ అందించిన నరేష్ కుమారన్ త్వరలోనే బిగ్ ప్రాజెక్ట్స్ చేయడం తథ్యం. ఇక సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఇక విద్యాధర్ కాగిత కథకుడిగా కాస్త తగ్గినా, మేకర్ గా మాత్రం పెద్ద ఇంప్యాక్ట్ ఇచ్చి పడేశాడు. ఇక క్రౌడ్ ఫండింగ్ తో చేసిన ఈ సినిమా విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం.

ప్లస్:

  • విశ్వక్ సేన్
  • చాందిని చౌదరి
  • డైరెక్షన్
  • మ్యూజిక్

మైనస్:

  • కథ
  • స్లో స్క్రీన్ ప్లే

రేటింగ్: 2.75/5 (టీమ్‌ ప్రయత్నానికి)

చివరి మాట: గామి.. 6 ఏళ్ళ కష్టానికి అర్ధ భాగమే ఫలితం

Show comments