ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయ్యిందా?.. ఇకపై 6 గంటల్లోనే అకౌంట్ లోకి రీఫండ్

ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయ్యిందా?.. ఇకపై 6 గంటల్లోనే అకౌంట్ లోకి రీఫండ్

భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్తను అందించింది. ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ అయి రీఫండ్ ఆలస్యమయ్యే సమస్యలకు చెక్ పెట్టింది. ఇకపై 6 గంటల్లోనే రీఫండ్ అకౌంట్లలో జమకానున్నది.

భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్తను అందించింది. ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ అయి రీఫండ్ ఆలస్యమయ్యే సమస్యలకు చెక్ పెట్టింది. ఇకపై 6 గంటల్లోనే రీఫండ్ అకౌంట్లలో జమకానున్నది.

సామాన్యుడి విమానమైన రైళ్లలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. సంపన్నులకైనా.. సామాన్యులకైనా రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఛార్జీలు తక్కువ, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. అయితే రైలు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకుంటుంటారు రైలు ప్రయాణికులు. కాగా కొన్ని కారణాల వల్ల టికెట్లను రద్దు చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే వెయిటింగ్ లిస్టులో ఉండి చివరి నిమిషంలో రద్దు అవుతుంది. ఆ సమయంలో ఈ టికెట్ క్యాన్సిల్ కు సంబంధించిన రీఫండ్ డబ్బులు ప్రయాణికుడి ఖాతాలోకి రావాలంటే కొన్ని రోజుల సమయం పట్టేది. ఈ నేపథ్యంలో టికెట్ క్యాన్సిల్ రీఫండ్ డబ్బులకు సంబంధించి భారతీయ రైల్వే గుడ్ న్యూస్ అందించింది.

మీ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయినా కూడా మీకు రీఫండ్ అందలేదా? ఇకపై ఈ జాప్యానికి తెరపడనున్నది. రైల్వే ప్రయాణికులకు టికెట్ క్యాన్సిల్ రీఫండ్ సమస్య తీర్చేందుకు భారతీయ రైల్వే రెడీ అయ్యింది. రీఫండ్ డబ్బులు ప్రయాణికులకు త్వరగా ఇచ్చేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఆన్ లైన్ టికెట్ రద్దు అయితే ఇకపై ఆరు గంటల్లోనే రీఫండ్ ఖాతాల్లో జమకానున్నది. క్యాన్సిల్ చేసుకుంటున్న ఇ- టికెట్లకు సంబంధించి 50 శాతం మేర రిఫండ్లను కేవలం 6 గంటల్లోనే అకౌంట్లలో జమ చేస్తున్నట్లు నేషనల్ మీడియా రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.

క్యాన్సిల్ చేసుకున్న ట్రైన్ టికెట్లతో పాటు టీడీఆర్ ఫైలింగ్ లోనూ 98 శాతం క్లెయిమ్ లను ఒక్క రోజులోనే పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు, వెయిటింగ్ లిస్ట్ లో ఉండి క్యాన్సిల్ అయినప్పుడు రిఫండ్లకు 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. దీంతో రైలు ప్రయాణికులు రైల్వే శాఖ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దృష్టిసారించిన అధికారులు రీఫండ్ 6గంటల్లోనే ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఆన్ లైన్ లో ఫైల్ చేసుకుంటే గంటల వ్యవధిలోనే టీటీఈలు ధృవీకరించడం ద్వారా రీఫండ్లు గంటల వ్యవధిలోనే ప్రయాణికుల ఖాతాల్లో జమ చేయడానికి వీలు కలుగుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

Show comments