Yuvraj Singh Trains Abhishek Sharma For India: ‘అరుంధతి’ కథను రిపీట్ చేస్తున్న యువరాజ్! ఇది కదా దేశంపై ప్రేమంటే!

‘అరుంధతి’ కథను రిపీట్ చేస్తున్న యువరాజ్! ఇది కదా దేశంపై ప్రేమంటే!

టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత జట్టు టీ20 ప్రపంచ కప్-2007, వన్డే వరల్డ్ కప్-2011 గెలవడంలో అతడి పాత్ర ఎంత ఉందో అందరికీ తెలిసిందే.

టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత జట్టు టీ20 ప్రపంచ కప్-2007, వన్డే వరల్డ్ కప్-2011 గెలవడంలో అతడి పాత్ర ఎంత ఉందో అందరికీ తెలిసిందే.

యువరాజ్ సింగ్.. భారత క్రికెట్​లోనే కాదు, వరల్డ్ క్రికెట్​లో కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. ఎన్నో రికార్డులను తన పేరు మీద లిఖించుకున్న ఆ స్పిన్ ఆల్​రౌండర్.. టీమిండియాకు రెండు వరల్డ్ కప్​లు అందించాడు. 2007లో పొట్టి కప్పు అందుకోవడలోనూ, 2011లో వన్డే ప్రపంచ కప్​ గెలవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. వన్డే వరల్డ్ కప్ సమయంలో క్యాన్సర్​తో బాధపడుతూ, రక్తపు వాంతులు అవుతున్నా పట్టించుకోకుండా ఆడి దేశానికి కప్పు అందించాడు. అలాంటోడు రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే యువీ కొత్త మిషన్ మొదలుపెట్టాడని చాలా మందికి తెలియదు. ‘అరుంధతి’ కథను రిపీట్ చేస్తూ దేశం మీద తనకు ఉన్న ప్రేమను ప్రూవ్​ చేసుకుంటున్నాడు.

వన్డే వరల్డ్ కప్-2011 తర్వాత టీమిండియా మళ్లీ కప్పు గెలవలేదు. 2013లో నెగ్గిన ఛాంపియన్స్ ట్రోఫీనే భారత్​కు చివరి ఐసీసీ ట్రోఫీ. ఆ తర్వాత నుంచి ఎంత ప్రయత్నించినా సెమీస్, ఫైనల్స్ వరకు వెళ్లడమే గానీ విజేతగా మాత్రం నిలవడం లేదు. ఇది కోట్లాది మంది అభిమానులతో పాటు యువీని కూడా తీవ్రంగా నిరుత్సాహపర్చింది. అందుకే వరల్డ్ కప్ మిషన్ మొదలుపెట్టాడీ లెజెండ్. ఐసీసీ కప్ కొట్టడమే ధ్యేయంగా తన ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇన్నాళ్లలో తన లాంటి మరో అగ్రెసివ్ ప్లేయర్ రాలేదు. దీంతో కప్పు వేటలో భారత టీమ్ వెనుకబడిపోతోంది. ఈ టైమ్​లో తన శిష్యుడు అభిషేక్ శర్మను రంగంలోకి దింపాడు యువీ.

ఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ హవా నడుస్తోంది. సన్​రైజర్స్ తరఫున ఓపెనర్​గా దిగుతూ మెరుపు ఆరంభాలు అందిస్తున్నాడతను. ఆడిన 12 మ్యాచుల్లో 205 స్ట్రైక్ రేట్​తో 401 పరుగులు చేశాడు. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. యువరాజ్​లా అవలీలగా సిక్సులు బాదుతున్నాడు అభిషేక్. చాలా షాట్స్​లో యువీని గుర్తుకుతెస్తున్నాడు. అంతా గురువు పోలికే. అదే తెగింపు, అదే యాటిట్యూడ్. అభిషేక్​కు ఇంకా 23 ఏళ్లే. ఈలోపు యువీ ఇంకా ట్రైనింగ్ ఇస్తాడు. టాలీవుడ్ క్లాసిక్ ‘అరుంధతి’ మూవీలో విలన్​ను చంపే అనుష్కను అనుష్కనే సృష్టించుకున్నట్లు.. ఇండియాకు మరో యువరాజ్​ను యువరాజే అందించే పనిలో ఉన్నాడు. మరి.. దేశం కోసం యువీ చేస్తున్న కృషిపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments