Actress Jayaprada: హీరోయిన్ జయప్రద అరెస్ట్ కు రంగం సిద్ధం.. అసలేం జరిగిందంటే

Jayaprada: హీరోయిన్ జయప్రద అరెస్ట్ కు రంగం సిద్ధం.. అసలేం జరిగిందంటే

ఒకప్పటి హీరోయిన్, మాజీ ఎంపీ జయప్రద అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేస్తోన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఏం జరిగిందంటే..

ఒకప్పటి హీరోయిన్, మాజీ ఎంపీ జయప్రద అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేస్తోన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఏం జరిగిందంటే..

ఒకప్పడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు జయప్రద. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. స‌మాజ్‌వాదీ పార్టీ త‌ర‌పున రాంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఆమె గత కొంత కాలంగా వార్తల్లో కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా జయప్రద అరెస్ట్‌కి రంగం సిద్ధమైంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాక జయప్రదను అరెస్ట్ చేయడం కోసం ఉత్తర ప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే..

సౌత్ లోనే కాక బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ప్రశంసలు అందుకున్న జయప్రద.. సినిమాలకు గుడ్ బై చెప్పి తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముందుగా ఆమె 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకు టీడీపీని వీడి.. ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. రెండు సార్లు ఏంపీగా గెలిచారు.  2004 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2019 నుంచి బీజేపీలో చేరారు. ఆ ఏడాది ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.

అయితే 2019లో ఎన్నికల సందర్భంగా జయప్రద.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆమె మీద రెండు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో  కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ జయప్రద మాత్రం న్యాయస్థానం ఎదుట  హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం గతంలో ఆమె మీదనాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది. ఈ క్రమంలో తాజాగా ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, జయప్రదని అరెస్ట్ చేయాలని రాంపూర్ కోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులని ఆదేశించింది. ఈ క్రమంలోనే మహిళా ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. దాంతో త్వరలోనే జయప్రద అరెస్ట్ తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.

2019 సార్వత్రిక ఎన్నికలకి ముందు సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపేలో చేరారు జయప్రద. యూపీ లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే ఆమె తన ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అజాం ఖాన్‌ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Show comments