Budget 2024 Analysis: ప్రజలకు వరంగా 3 ప్రభుత్వ పథకాలు.. వాటిపై నిర్మలమ్మ వ్యాఖ్యలు

Budget 2024 Analysis: ప్రజలకు వరంగా 3 ప్రభుత్వ పథకాలు.. వాటిపై నిర్మలమ్మ వ్యాఖ్యలు

Union Budget 2024 Highlights & Analysis in Telugu.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తాత్కాలిక పద్దు కావడంతో కీలక నిర్ణయాలు చేయలేదు. అయితే గత ఐదేళ్లలో ప్రభుత్వం అందించిన సేవలు, పథకాల గురించి చెప్పారు నిర్మలా.. వాటిల్లో..

Union Budget 2024 Highlights & Analysis in Telugu.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తాత్కాలిక పద్దు కావడంతో కీలక నిర్ణయాలు చేయలేదు. అయితే గత ఐదేళ్లలో ప్రభుత్వం అందించిన సేవలు, పథకాల గురించి చెప్పారు నిర్మలా.. వాటిల్లో..

పార్లమెంట్‌లో 2024-25 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. ఆరవ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డ్ సృష్టించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కావడంతో.. పెద్దగా విధానపరమైన కీలక నిర్ణయాలు చేయలేదు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టే క్రమంలో నిర్మలా సీతారామన్.. ఈ ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన పనుల గురించి పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా ప్రజలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకాల గురించి ప్రస్తావించింది. ఆమె ప్రస్తావించిన ఈ పథకాలు ఏంటో చూద్దాం.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అనగా..

బలహీన వర్గాలకు, తక్కువ ఆదాయ ప్రజలకు ఆర్థిక సేవలను అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన పథకమే జన్ ధన్ యోజన. జన్ ధన్ ఖాతా పేరిట బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేయించి.. 2 వేల వరకు డ్రాప్ట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ సేవల్లో రుణం, బీమా, పెన్షన్ ఉన్నాయి. ఈ పథకం కింద ఖాతాదారులకు రూ. 10వేలు వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం లభిస్తుంది. మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందాలంటే.. ఖాతా తెరిచిన 6 నెలల దాటాకే వర్తిస్తుంది. ఆరు నెలల లోపు అయితే.. రూ. 2 వేల వరకు అందుబాటులో ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ కోసం గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు. అలాగే కరోనా సమయంలో ఈ ఖాతాల్లో నెలకు రూ. 500 చొప్పున.. మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం జమ చేసింది.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతుల కోసం ఏర్పాటు చేసిన పథకం. భూమి ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తుంది.. అదీ కూడా విడతల వారీగా. ప్రతి నాలుగు నెలలకొకసారి దశల వారీగా రూ. 2 వేలు చొప్పున అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. గత ఏడాది నవంబర్ లో కోట్లాది మంది రైతుల ఖాతాల్లో 15వ విడతను ప్రభుత్వం విడుదల చేసింది.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన

కోవిడ్ మహమ్మారి దేశాన్ని పట్టి పీడించిన సమయంలో వచ్చిన పథకమే గరీబ్ కళ్యాన్ అన్న యోజన. 2020లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా పేద కుటుంబానికి ఉచితంగా రేషన్ అందించింది. ప్రతి వ్యక్తికి రూ. 5 కిలోల చొప్పున ధాన్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. నవంబర్ 2021లో ఈ పథకాన్ని నాలుగు నెలల పాటు పొడిగించారు. ఆ తర్వాత ప్రధాని నేతృత్వంలో మంత్రి వర్గం ఈ పథకాన్ని ఏడాది జనవరి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Show comments