Ugadi 2024 Panchamgam: క్రోది నామ సంవత్సరం మకర రాశి జాతకం! ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

Ugadi 2024 Panchamgam: క్రోధీ నామ సంవత్సరం మకర రాశి జాతకం! ఆదాయం, రాజపూజ్యం ఎంతంటే?

Ugadi 2024 Panchangam Makara Rasi Phalalu in Telugu: తెలుగు వారికి ఏప్రిల్ 9నుంచి కొత్త సంవత్సరం మొదలవ్వబోతుంది. ఈ ఏడాది క్రోధి నామ సంవత్సరంగా పిలువబడుతున్న ఉగాది రోజున పంచాంగ శ్రవణం విని వారి వారి జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. మరి ఈ ఏడాది మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు అందనున్నాయో చూసేద్దాం.

Ugadi 2024 Panchangam Makara Rasi Phalalu in Telugu: తెలుగు వారికి ఏప్రిల్ 9నుంచి కొత్త సంవత్సరం మొదలవ్వబోతుంది. ఈ ఏడాది క్రోధి నామ సంవత్సరంగా పిలువబడుతున్న ఉగాది రోజున పంచాంగ శ్రవణం విని వారి వారి జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. మరి ఈ ఏడాది మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు అందనున్నాయో చూసేద్దాం.

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది. ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇక ఉగాది పర్వదినం అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది పంచాగ శ్రవణం, రాశి ఫలాలు. ప్రతి ఏటా ఉగాది పండుగ నాడు పండితులు, జ్యోతిశాస్త్ర నిపుణులు ఆ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి.. దేశవ్యాప్తంగా పరిస్థితులు, వాతావరణం, పాడి పంటలు ఎలా ఉండబోతున్నాయో చెబుతుంటారు.

ఉగాది నాడు ప్రతి ఒక్కరు పంచాగ శ్రవణం చేస్తారు. రాజకీయ నాయకులు సైతం.. తమ పార్టీ కార్యాలయాలు, ఇండ్లలో పంచాగ శ్రవణం ఏర్పాటు చేయించుకుంటారు. ఇక రాశుల వారీగా చూసుకుంటే.. ఈ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది మకర రాశి వారికి ఉద్యోగ, ఆరోగ్య, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి.. జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చేప్పారంటే..

జోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొంతకాలంగా ఉద్యోగంలో వేధిస్తున్న అనేక సమస్యలకు తొలగిపోయి.. ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు గతంతో పోల్చుకుంటే.. ఈ ఏడాది వ్యాపారాభివృద్ధి అధికంగా అనుకూలంగా ఉంది. అలాగే ధనపరమైన సమస్యల నుంచి ఈ ఏడాది మకర రాశి వారు బయటపడనున్నారు. అంతేకాకుండా విదేశీ ప్రయత్నాలు చేసే వారికీ ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు ఈ సంవత్సరం కెరీర్ పరంగా అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది.

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వారికి.. బృహస్పతి 6వ స్థానంలో, శని 2వ స్థానంలో, రాహువు 3వ స్థానంలో సంచరిచడం చేత.. ఈ రాశి వారికి ఈ ఏడాది అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మకర రాశి జాతకులకు ఈ ఏడాది ఆరోగ్య సమస్యలు వేదించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్య విషయాలలో, కుటుంబ వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ, గతంతో పోల్చుకున్నట్లైతే ఈ ఏడాది అనుకూలంగానే ఉంటుంది. ఇక సినీ, మీడియా రంగాల వారికి కూడా ఈ ఏడాది మధ్య నుంచి అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు తమ జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయని.. పండితులు చెబుతున్నారు.

ఇక ఆదాయ, వ్యయాల విషయానికి వస్తే ఈ ఏడాది మకర రాశి వారికి

  • ఆదాయం-14,
  • వ్యయం-14,
  • రాజపూజ్యం-3,
  • అవమానం-1 గా ఉంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.
Show comments