Ugadi 2024 Panchamgam: సింహ రాశి వారికి క్రోధీ నామ సంవత్సరం గడ్డుకాలమే, కానీ..!

Ugadi 2024 Panchamgam: సింహ రాశి వారికి క్రోధీ నామ సంవత్సరం గడ్డుకాలమే, కానీ..!

Ugadi 2024 Panchangam Simha Rasi Rasi Phalalu in Telugu: ఏప్రిల్ 9నుంచి క్రోధి నామ సంవత్సరం మొదలవుతుంది. ఉగాది అంటే ముఖ్యంగా అందరికి వారి వారి జాతకాలు తెలుసుకోవాలనే ఆశక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది సింహ రాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో చూసేద్దాం.

Ugadi 2024 Panchangam Simha Rasi Rasi Phalalu in Telugu: ఏప్రిల్ 9నుంచి క్రోధి నామ సంవత్సరం మొదలవుతుంది. ఉగాది అంటే ముఖ్యంగా అందరికి వారి వారి జాతకాలు తెలుసుకోవాలనే ఆశక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది సింహ రాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో చూసేద్దాం.

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది. ఏప్రిల్ 9, మంగళవారం నుంచి క్రోధీ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇక ఉగాది పర్వదినం అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది పంచాగ శ్రవణం, రాశి ఫలాలు. ప్రతి ఏటా ఉగాది పండుగ నాడు పండితులు, జ్యోతిశాస్త్ర నిపుణులు ఆ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.. ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి.. దేశవ్యాప్తంగా పరిస్థితులు, వాతావరణం, పాడి పంటలు ఎలా ఉండబోతున్నాయో చెబుతుంటారు.

ఉగాది నాడు ప్రతి ఒక్కరు పంచాగ శ్రవణం చేస్తారు. రాజకీయ నాయకులు సైతం.. తమ పార్టీ కార్యాలయాలు, ఇండ్లలో పంచాగ శ్రవణం ఏర్పాటు చేయించుకుంటారు. ఇక రాశుల వారీగా చూసుకుంటే.. ఈ క్రోధి నామ సంవత్సరంలో సింహ రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది సింహ రాశి వారికి ఉద్యోగ, ఆరోగ్య, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి.. జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చేప్పారంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి వారికీ.. ఈ ఏడాది దశమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. అందుచేత నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో లాభములు కలుగును. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక సింహ రాశి వారి ఆరోగ్య విషయానికొస్తే.. ఆరోగ్యపరంగా వీరికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నది. గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యంలో అనేక మార్పులు కనిపించే అవకాశం ఉందని.. జోతిష్య శాస్త్ర పండితులు పేర్కొన్నారు. అలాగే సింహ రాశి జాతకుల ఆర్ధికపరమైన విషయానికొస్తే..ఈ సంవత్సరం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే, అప్పుల బాధలు మాత్రం ఉండవు. ధన సంబంధం అయిన విషయాల్లో.. ఆశించిన స్థాయిలో లాభం పొందకపోయినా కూడా ఎటువంటి నష్టానికి మాత్రం లోనవ్వరు.

కాగా, సింహరాశి వారికి ఈ ఏడాది మధ్య నుంచి చెడు ఫలితాలు సంతరించే అవకాశం ఉంది. బృహస్పతి దశమ స్థానమునందు, శని సప్తమ స్థానము నందు, రాహువు అష్టమస్థానము నందు, కేతువు వాక్‌ స్థానమునందు సంతరించడం చేత ఈ ఏడాది మధ్య నుంచి కొంచెం చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉందని.. కాబట్టి ఈ రాశి వారు గొడవలకు, అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని.. అలాగే రాహువు ప్రభావం చేత కుటుంబ విషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ.. వారు అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని.. . పండితులు సూచిస్తున్నారు.

అలాగే ఈ ఏడాది విద్యార్థుల విషయానికొస్తే.. విద్యార్థులకు.. ఈ సంవత్సరం మరింత కష్టపడాల్సిన సమయం, అలాగే వారి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సినీ మీడియా రంగాల వారికి ఈ ఏడాది మధ్య నుంచి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు అనారోగ్యం, కుటుంబ సమస్యలు వేదించినప్పటికీ.. వ్యాపారంలో మాత్రం మధ్యస్థంగా ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సింహ రాశి జాతకులైన స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

ఇక ఆదాయ, వ్యయాల విషయానికి వస్తే ఈ ఏడాది సింహ రాశి వారికి

  • ఆదాయం-2,
  • వ్యయం-14,
  • రాజపూజ్యం-2,
  • అవమానం-2 గా ఉంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పై సమాచారాన్ని ఐడ్రీమ్ మీడియా నిర్థారించడం లేదు.
Show comments