రాత్రి పూట అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారా?.. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు!

రాత్రి పూట అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారా?.. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు!

రాత్రిపూటనే కదా అని సరదాగా బయటికెళ్లి తిరుగుతున్నారా? అయితే మీకు ఇబ్బందులు తప్పవు. రాత్రి వేళ అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరిగితే ఇక అంతే సంగతి. ఇంతకీ కారణం ఏంటంటే?

రాత్రిపూటనే కదా అని సరదాగా బయటికెళ్లి తిరుగుతున్నారా? అయితే మీకు ఇబ్బందులు తప్పవు. రాత్రి వేళ అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరిగితే ఇక అంతే సంగతి. ఇంతకీ కారణం ఏంటంటే?

రాత్రి వేళలో కొంతమంది ఆకతాయిలు అనవసరంగా రోడ్లపై తిరుగుతూ హల్ చల్ చేస్తుంటారు. ఏ పని లేకున్నా రోడ్లపైకి వచ్చి, వీదుల్లో తిరుగుతూ రచ్చరచ్చ చేస్తుంటారు. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. మరికొంతమంది బైక్ రేసింగ్స్, స్టంట్స్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. అయితే ఇకపై మీరు ఏ పని లేకున్నా సరదాగా రోడ్లపైకి వచ్చి తిరిగితే మాత్రం మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. రాత్రి వేళ అనవసరంగా రోడ్లపై తిరిగే వారికి అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ ఆపరేషన్ చబుత్రను తీసుకొచ్చింది. దీంతో అలాంటి వారికి కౌన్సెలింగ్ ఇస్తూ.. అవసరమైతే అరెస్టు కూడా చేయొచ్చు.

మీరు ఏ పని లేకున్నా కూడా రాత్రి వేళ సరదాగా బయటికి వచ్చి తరుగుతున్నారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండండి. పోలీసులకు చిక్కారో కటకటాల్లోకి పోవడం ఖాయం. పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేయొచ్చు. గతంలోనే తెలంగాణ పోలీసులు ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్ చబుత్రను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు రాజన్న సిరిసిల్లలో పోలీసులు ఆపరేషన్ చబుత్రను ప్రారంభించారు. ఇక నుంచి రాత్రిపూట రోడ్లపై యువత పని పాట లేకుండా తిరిగితే అంతే సంగతి. సిరిసిల్లలో పోలీసులు ఎస్పీ అఖిల్ మహాజన్ అధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ చబుత్రాలో భాగంగా, ఏ కారణం లేకుండా తిరుగుతున్న 256 మంది యువతను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో 81 ద్విచక్ర వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.

ఆపరేషన్ చబుత్ర మంచి ఫలితాలను అందించడంతో పోలీసులు మళ్లీ ప్రారంభిస్తున్నారు. జులాయిగా తిరిగే యువతను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మత్తుపదార్థాలకు బానిసలుగా మారి అర్థరాత్రుళ్లు అనవసరంగా తిరుగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నవారికి అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్ చబుత్ర మంచి ఫలితాలను అందిస్తోందంటున్నారు పలువురు. ఒకటి కంటే ఎక్కువ సార్లు పట్టుబడితే తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. మరి మీరు కూడా రాత్రిపూటా సరదాగా తిరుగుదామని బయటికి వచ్చారో పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేయొచ్చు. కాబట్టి రాత్రిపూట అనవసరంగా బయటికి వచ్చి కొత్త సమస్యలను కొని తెచ్చుకోకండి.

Show comments