MS Dhoni: RCB డ్రెస్సింగ్ రూమ్ లో ధోని.. ఏం చేశాడో మీరే చూడండి! వీడియో వైరల్..

MS Dhoni: RCB డ్రెస్సింగ్ రూమ్ లో ధోని.. ఏం చేశాడో మీరే చూడండి! వీడియో వైరల్..

ఆర్సీబీ  డ్రెస్సింగ్ రూమ్ లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు మహేంద్రసింగ్ ధోని. మరి బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్ లో ధోని ఏం చేశాడో? మీరే చూడండి.

ఆర్సీబీ  డ్రెస్సింగ్ రూమ్ లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు మహేంద్రసింగ్ ధోని. మరి బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్ లో ధోని ఏం చేశాడో? మీరే చూడండి.

ఐపీఎల్ 2024 సీజన్ లోనే హై ఓల్టేజ్ మ్యాచ్ శనివారం(మే 18) జరగబోతోంది. ఒకే ఒక్క ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఢీ కొనబోతున్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ కోసం చిన్నస్వామి స్టేడియం సిద్దమైంది. ఇక ఇరు జట్ల ఫ్యాన్స్ ఈ కీలక మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరు చేరుకున్న సీఎస్కే ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్సీబీ  డ్రెస్సింగ్ రూమ్ లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు మహేంద్రసింగ్ ధోని. మరి బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్ లో ధోని ఏం చేశాడో? మీరే చూడండి.

మెున్న కేకేఆర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించి అందరికి షాకిచ్చాడు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ సైతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా ఒక జట్టు ప్లేయర్లు గ్రౌండ్ లో సరదాగా కలవడం, ఇక అప్పుడప్పుడు ప్రత్యర్థి డగౌట్ లో కూర్చోవడం చూస్తూనే ఉంటాం. కానీ ప్రత్యర్థి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది.

ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ సీజన్ లోనే హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కఠోరంగా నెట్స్ లో శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లో దర్శనమిచ్చాడు. అయితే అక్కడికి వెళ్లిన ధోని ఏం చేశాడో తెలుసా? ధోనికి టీ అంటే ఎంత ఇష్టమో గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా టీ కప్పు పట్టుకుని ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్  లోకి వచ్చి ఓ టీ అడిగి తాగాడు. సింపుల్ గా కప్పు పట్టుకుని టీ కోసం వచ్చిన ధోనిని చూసి.. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ధోని సింప్లీ సిటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments