Tripti Dimri: యానిమల్ సెకండ్ హీరోయిన్.. గత చిత్రాలు ఇవే! ఒక రేంజ్ లో ఉంటాయి!

Tripti Dimri: యానిమల్ సెకండ్ హీరోయిన్.. గత చిత్రాలు ఇవే! ఒక రేంజ్ లో ఉంటాయి!

  • Author Soma Sekhar Updated - 04:53 PM, Wed - 13 December 23

Tripti Dimri: యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా జోయా పాత్రలో మెరిసిన త్రిప్తి దిమ్రి అందాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె నటించిన గత చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

Tripti Dimri: యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా జోయా పాత్రలో మెరిసిన త్రిప్తి దిమ్రి అందాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె నటించిన గత చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

  • Author Soma Sekhar Updated - 04:53 PM, Wed - 13 December 23

త్రిప్తి దిమ్రి.. ప్రస్తుతం ఈ పేరు ఇండియా వైడ్ గా మారుమ్రోగుతోంది. గతంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. గుర్తింపు వచ్చింది మాత్రం యానిమల్ తోనేనని చెప్పాలి. అంతలా జోయా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక త్రిప్తి నటనకు, అంద చందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ బ్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడంతో.. నెట్టింట్లో ఈ భామ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు కూడా బయటకి వస్తున్నాయి. అందులో ఒకటి కోహ్లీ బావతో ప్రేమాయణం. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నటించిన గత చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

త్రిప్తి దిమ్రి.. యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా జోయా పాత్రలో మెరిసిన ఈ భామ అందాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. రణ్ బీర్ తో ఘాటు రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఎవరని? నెట్టింట తెగ వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే త్రిప్తి దిమ్రికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ప్రేమ వ్యవహారాలు.. ఆమె నటించిన గత సినిమాలు వైరల్ గా మారుతున్నాయి. కాగా.. 2017లో ‘పోస్టర్ బాయ్స్’ అనే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన త్రిప్తి.. అదే సంవత్సరం దివంగత నటి శ్రీదేవి నటించిన ‘మామ్’ చిత్రంలో స్వాతి పాత్రలో మెరిసింది. ఈ రెండు సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఆ తర్వాత 2018లో వచ్చిన లైలా మజ్ను మూవీ ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది. ఇందులో రియా పాత్రలో ఆమె నటన, గ్లామర్ అద్భుతమనే చెప్పాలి. ఈ క్రమంలోనే ‘బల్బుల్’ మూవీలో నటనకు గానూ 2020 ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డు వరించింది. ఇదిలా ఉండగా త్రిప్తి నటించిన గత చిత్రాలైన లైలా మజ్ను- జీ 5, బల్బుల్, ఖాలా మూవీలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక యానిమల్ సినిమాలోని జోయా పాత్రతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది త్రిప్తి దిమ్రి. మరి ఒకేఒక్క మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ సోయగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments