కారులో కూతుర్ని వదిలేసి.. పెరేంట్స్ పెళ్లికి! 3 గంటల తర్వాత!

కారులో కూతుర్ని వదిలేసి.. పెరేంట్స్ పెళ్లికి! 3 గంటల తర్వాత!

పిల్లలను తీసుకొని బయటకు వెళుతున్న పేరెంట్స్ బీ అలర్డ్. ఒక్క క్షణం ఆదమరిచితే చాలు.. పిల్లలు మనకు దక్కకుండా పోతున్నారు. అటువంటి ఘటనే తాజాగా ఒకటి చోటుచేసుకుంది.

పిల్లలను తీసుకొని బయటకు వెళుతున్న పేరెంట్స్ బీ అలర్డ్. ఒక్క క్షణం ఆదమరిచితే చాలు.. పిల్లలు మనకు దక్కకుండా పోతున్నారు. అటువంటి ఘటనే తాజాగా ఒకటి చోటుచేసుకుంది.

తల్లిదండ్రులు చేసిన చిన్న చిన్న నిర్లక్ష్యపు పనుల వల్ల.. అభం శుభం తెలియని చిన్నారులు బలైపోతున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడల్లా.. పిల్లలపై ప్రతాపాలు చూపిస్తుంటారు. వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. అలాగే తమ పనుల్లో నిమగ్నమై.. పిల్లల్ని పట్టించుకోరు. బయటకు వెళ్లినప్పుడు పిల్లల్ని వదిలేస్తుంటారు. ఆ సమయంలో ఆటల్లో మునిగిపోయిన చిన్నారులు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఈ తరహా ఘటనే జరిగింది. కారులో కూతుర్ని వదిలేసి పెళ్లి వేడుకలకు హాజరయ్యారు పేరెంట్స్.  చివరకు ఆ కూతురు ఊపిరాడక చనిపోయింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ప్రదీప్, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పెళ్లికి హాజరయ్యాడు. నలుగురు కలిసి కారులో వెళ్లాడు. ఫంక్షన్ వద్దకు రాగానే పెద్ద కూతుర్ని కారు నుండి దించారు. ఇద్దరు కుమార్తెలు కారు దిగిపోయి.. తల్లితో కలిసి ఫంక్షన్ హాల్‌లోకి వెళ్లి ఉంటారని భావించిన ప్రదీప్‌ కారును ఒక చోట పార్క్‌ చేసి డోర్‌ లాక్‌ చేశాడు. అయితే అందులో చిన్న కూతురు గోర్విక ఉందన్న విషయాన్ని ఆయన గుర్తించలేదు. పెళ్లిలో వచ్చిన బంధువులు, చుట్టాలతో మాటలు కలిపారు. ముచ్చట్లలో మునిగి తేలారు. పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటారులే అనుకున్నారు కానీ.. చిన్న పాప లేదు అన్న సంగతి ఎవ్వరూ గ్రహించలేదు. అంతలో పెద్ద పాప చెల్లి ఏదీ నాన్న అనుకుంటూ వచ్చింది.

అమ్మ దగ్గర ఉందేమో అనుకున్నాడు. ఆమె దగ్గర కూడా లేకపోవడంతో ఇద్దరు కలిసి వెతకసాగారు. చిన్నారి గురించి మొత్తం వెతికారు. చివరకు కారులో ఉందేమోనన్న అనుమానం వచ్చింది. అప్పటికే మూడు గంటలు దాటింది. కారు వద్దకు వెళ్లి చూడగా.. గోర్విక అచేతనంగా పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఊపిరాడక చనిపోయిందని వైద్యులు నిర్దారించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదు. కాగా, పోస్టుమార్టం నిర్వహించేందుకు పేరెంట్స్‌ నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. కానీ ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై పెద్ద చర్చ నడుస్తోంది. పిల్లలను వదిలేసి.. తమ ఆనందాలకు పరిమితమౌతున్నారని మండిపడుతున్నారు.

Show comments