హాస్టల్‌లో బీటెక్ విద్యార్థినిపై దారుణం.. స్నానం చేయడానికి వెళ్తుండగా..

హాస్టల్‌లో బీటెక్ విద్యార్థినిపై దారుణం.. స్నానం చేయడానికి వెళ్తుండగా..

అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. బీటెక్ చదువుతున్న ఓ అమ్మాయి మీద కొందరు ఆగంతకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె స్నానం చేయడానికి వెళ్తుండగా..

అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. బీటెక్ చదువుతున్న ఓ అమ్మాయి మీద కొందరు ఆగంతకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె స్నానం చేయడానికి వెళ్తుండగా..

ఇటీవల కాలంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు, దాడులు ఎక్కువైపోయాయి. ఇంట్లోనూ, బయట, చదువుకునే చోట ఇలా ఎక్కడ చూసినా వారికి భద్రత లేకుండా పోతుంది. కాలేజీల్లో కూడా ఆడపిల్లలపై దారుణానికి ఒడి గడుతున్నారు. ఒప్పుకోలేదని దాడులకు పాల్పడుతున్నారు. హాస్టల్ లో కూడా ఆగంతకుల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. బీటెక్ విద్యార్థిని స్నానం చేయడానికి వెళ్తుండగా.. 

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై యువకులు దారుణానికి పాల్పడ్డారు. యూనివర్సిటీ హాస్టల్ లేఖ్య అనే విద్యార్థిని స్నానం చేసే బకెట్ లో ఆగంతకులు యాసిడ్ పోశారు. ఎప్పటిలానే యధావిధిగా స్నానం చేసేందుకు వెళ్ళింది లేఖ్య. యాసిడ్ కలిపిన విషయం తెలియని లేఖ్య స్నానం నీరు అనుకుని ఒంటి మీద పోసుకుంది. దీంతో ఆమె ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. లేఖ్య అరుపులు, కేకలు విన్న తోటి విద్యార్థినులు, యూనివర్సిటీ యాజమాన్యం ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆమెకు తీవ్ర గాయాలు అవ్వడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో ఆమెను పోలీసులు విచారించారు. ఆసుపత్రిలో విద్యార్థిని నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఆగంతకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. లేఖ్యపై జరిగిన దాడికి నిరసనగా మిగిలిన స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని లేఖ్యకు న్యాయం చేయాలని కోరారు.

Show comments