Hyderabad Traffic Alert: హైదరాబాద్‌లో హై అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

Hyderabad Traffic Alert: హైదరాబాద్‌లో హై అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

రేపు రంజాన్ పండగను ఘనంగా జరుపుకునేందుకు ముస్లిం సోదరులు సిద్దమయ్యారు. అలానే హైదరాబాద్ నగరం కూడా ఈ వేడుకులను జరపుకునేందుకు రెడీ అయ్యేంది. ఈ నేపథ్యంలోనే రేపు నగరంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

రేపు రంజాన్ పండగను ఘనంగా జరుపుకునేందుకు ముస్లిం సోదరులు సిద్దమయ్యారు. అలానే హైదరాబాద్ నగరం కూడా ఈ వేడుకులను జరపుకునేందుకు రెడీ అయ్యేంది. ఈ నేపథ్యంలోనే రేపు నగరంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వం కూడా ఈ సమస్యపై అనేక చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో ప్రత్యేక సందర్భాల్లో ఏర్పడే ట్రాఫిక్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అందుకే ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందే కీలక ప్రకటన చేస్తుంటారు. ఏదైనా పర్వదినాలు, ఇతర కార్యక్రమాల సమయంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు కీలక చర్యలు తీసుకుంటారు. తాజాగా కూడా హైదరాబాద్ లో ట్రాఫిక్ అలర్ట్ ప్రకటించారు నగర  పోలీసులు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రేపు రంజాన్  సందర్భంగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. అలానే రేపు మరికొన్ని ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగున్నాయి. ముఖ్యంగా మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ లోని హాకీ గ్రౌండ్స్ లో ఈదుల్ ఫితర్ ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో నగర ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. మీర్ ఆలం ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనలు జరగనున్న నేపథ్యంలో ఈద్గా, తడ్బన్ వైపు వాహనాలను అనుమతించరు. ఇటుగా వచ్చే వాహనాలకు ప్రత్యామ్న్యాయంగా బహదూర్ పురా చౌరస్తా నుంచి కిషన్ బాగ్, కామాటిపురా, పురానాపూల్ వైపు మళ్లిస్తారు.

అలానే ఈద్గా వైపు వెళ్లే వెహికల్స్ ను శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట  ప్రాంతాల వైపు మళ్లిస్తారు.  అదేవిధంగా కాలాపత్తర్ వపమ మోచి కాలనీ, బహదూర్ పురా, షంషీర్ గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు మళ్లీంచనున్నారు. అంతేకాక మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి.  పురానాపూల్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులతో సహా ఇతర భారీ వెహికల్స్ ను జియాగూడ వైపు మళ్లీంచనున్నారు. అలానే శంషాబాద్, రాజేంద్రనగర్ నుంచి బహదూర్పురా వైపు వచ్చే భారీ వాహనాలను ఆరాంఘర్ జంక్షన్ వద్ద ఆయా ప్రాంతాల వైపు మళ్లిస్తారు.

ఇక మెహిదీపట్నం ప్రాంతంలోని మాసబ్ ట్యాంక్ జంక్షన్ ఫ్లైఓవర్ కింద రంజాన్ ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వంతెన కింద నుంచి వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మెహిదీపట్నం, లక్డీకాపూల్ వైపు ప్లైవర్ పై మాత్రమే రాకపోకలు సాగించవచ్చు. బంజారాహిల్స్ రోడ్ నెం.12 నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే వాహనాలను రోడ్ నంబర్ 1, 12 జంక్షన్ నుంచి తాజ్ కృష్ణ హోటల్, ఆర్టీఏ ఖైరతాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. రేపు హైదరాబాద్ తో పాటు దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు ప్రారంభమవుతాయి. కాబట్టి రంజాన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Show comments