Chandrakanth Wedding Video Viral: చంద్రకాంత్ పెళ్లి వీడియో వైరల్.. ఇంత మంచి భార్యకి అన్యాయం చేసి!

Chandrakanth: చంద్రకాంత్ పెళ్లి వీడియో వైరల్.. ఇంత మంచి భార్యకి అన్యాయం చేసి!

టీవీ నటుడు చంద్రకాంత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి పెళ్లి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

టీవీ నటుడు చంద్రకాంత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి పెళ్లి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

సీరియల్‌ నటుడు చంద్రకాంత్‌ శుక్రవారం నాడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు, సహనటి పవిత్ర జయరామ్‌ మృతిని జీర్ణించుకోలేక.. ఈ దారుణానికి ఒడిగట్టాడు చందు. అతడి మృతి కుటుంబానికే కాక ఇండస్ట్రీకి కూడా తీరని లోటంటున్నారు. ప్రేమించిన వ్యక్తి కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు.. అతడి మీదే ప్రాణాలు పెట్టుకున్న కుటుంబ సభ్యలు, పిల్లలకు తీరని అన్యాయం చేశాడు చంద్రకాంత్‌. అతడి మృతి పట్ల అభిమానులతో పాటు.. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్రకాంత్‌ పెళ్లి వీడియో వైరల్‌ అవుతుంది.

చంద్రకాంత్‌కు 2015లో వివాహం అయ్యింది. శిల్ప అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరిది లవ్‌ మ్యారేజ్‌ కావడం విశేషం. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే చందు.. శిల్పను ప్రేమించాడు. తనను ప్రేమించాలంటూ సుమారు 3 ఏళ్ల పాటు.. శిల్పను వెధించాడు. చివరకు ఆమె అతడి లవ్‌ని అంగీకరించింది. 12 ఏళ్ల పాటు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. చివరకు 2015లో తల్లిదండ్రుల అంగీకారంతో.. ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఇక వీరికి ఇద్దరు పిల్లలు సంతానం కూడా ఉన్నారు. ఎంతో ప్రేమించి.. పెద్దలను ఒప్పించి మరీ శిల్పను పెళ్లి చేసుకున్న చందు.. పవిత్రకు దగ్గరవ్వడంతో వారి బంధం బలహీనం అయ్యింది.

పర స్త్రీ మోజులో పడి.. తనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భార్యకు తీరని అన్యాయం చేశాడు చందు. ఇక ఆత్మహత్య చేసుకుని.. కన్నవారికి తీరని కష్టాన్ని కానుకగా ఇచ్చాడు. ఇక చందు బిడ్డ మాటలు వింటే ఎవరైనా కన్నీరు పెట్టుకోవాల్సింది. జీవితాంతం చేయి పట్టి నడిపించాల్సిన తండ్రి.. ఇలా అర్ధాంతరంగా తమ చేయి విడిచిపెడతాడని ఆ చిన్నారులు అస్సలు ఊహించలేదు. తండ్రి కోసం వారు గుక్కపట్టి ఏడుస్తున్నారు.

ఇక పవిత్ర జయరామ్‌ వల్ల తన కొడుకు చనిపోయాడని చందు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పవిత్రతో పరిచయం అయ్యాకే చందు తమకు దూరం అయ్యాడని.. ఆమె కోసం కన్న వారిని, కట్టుకున్న భార్యని, కడుపున పుట్టిన బిడ్డలకు కూడా అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడని భావించిన కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తాడని తాము కలలో కూడా అనుకోలేదని కన్నీరుమున్నీరవుతుంది. ఇక చంద్రకాంత్‌ పెళ్లి వీడియో చూసిన వారు.. ఇంత మంచి భార్యకు ఎలా అన్యాయం చేయాలనిపించింది బ్రదర్‌.. పైగా ప్రేమ వివాహం చేసుకున్నావ్‌.. మరి ఇప్పుడు ఆ లవ్‌ ఎక్కడికి పోయింది.. ఎందుకు వారికి ఇంత అన్యాయం చేశావ్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

Show comments