కన్నతల్లిపై కొడుకు దారుణం.. కాలితో తన్నుతూ దాడి..!

కన్నతల్లిపై కొడుకు దారుణం.. కాలితో తన్నుతూ దాడి..!

వృద్ధాప్యంలో తల్లికి ఆసరా ఉండాల్సిన కొడుకు అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. కనీసం తిరగబడి ప్రతిఘటించలేని తల్లిని విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

వృద్ధాప్యంలో తల్లికి ఆసరా ఉండాల్సిన కొడుకు అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. కనీసం తిరగబడి ప్రతిఘటించలేని తల్లిని విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ భూమిపై ఏ స్వార్థం లేని ప్రేమ అంటే.. అది తల్లిదండ్రులది మాత్రమే. ముఖ్యంగా కన్నతల్లి ప్రేమకు సమానమైనది ఈ భూమి మీద మరేది లేదు. బిడ్డ కోసం తన సుఖాలను, సంతోషాలను వదిలేసుకుని జీవిస్తుంది. వారి సంతోషాన్నే తన ఆనందంగా భావించి తల్లి మురిసిపోతుంది. పిల్లలు చిన్నతనంలో గుండెలపై తన్నుతుంటే.. సంతోషంగా స్వీకరిస్తుంది. అయితే నేటికాలంలో పెంచిన తల్లినే కొందరు పుత్రులు గుండెలపై తన్నుతున్నారు. మరీ దారుణంగా భార్య మోజులో కొందరు, ఆస్తుల విషయంలో మరికొందరు తల్లిదండ్రులపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ పుత్ర రత్నం చేసిన పని అందరిని విస్మయానికి గురి చేసింది. తల్లిని గుండెలపై కాలితో తన్నుతూ దారుణంగా కొట్టాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అని మన గురువులు చెబుతుంటారు. నిజమే జీవితాన్ని ప్రసాదించి, పెంచి పెద్ద చేసి మన కాళ్ల మీద మనం నిలబడేటట్లు చేస్తారు. తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలకు చదువులు చెప్పించి  పెంచుతారు. తనకు తినడానికి ఏమిలేకపోయినా తన పిల్లలకు ఉంటే చాలు అనుకునే తల్లిదండ్రులను నిత్యం చూస్తూ ఉంటాం. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కష్టనష్టాలను ఓర్చి వారిని పెంచి పెద్దచేస్తుంటారు. కానీ కొందరు బిడ్డలు మానవత్వం మర్చిపోయి..తల్లిదండ్రులపై దారుణాలకు తెగబడుతున్నారు.

ఎన్నో కష్టాలు పడుతూ తమను పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నలపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.  కొన్ని కొన్ని ఘటనలు చూస్తే.. రక్త సంబంధాల కంటే.. ఆర్థిక సంబంధాలే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ధనం, పొలం కోసం కన్నవారిని తోడబుట్టిన వారిని, కనిపెంచిన అమ్మనాన్నలపై దాడులకు పాల్పడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు..తమ పేగులనే కత్తులతో పొడిచేస్తుంటే.. నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

అన్నమయ్య జిల్లా మదనపల్లె నీరుగుట్టివారిపల్లెలో ఓ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల పశువుల ప్రవర్తించాడు. తల్లిదండ్రులపై పట్ల మానవత్వం లేకుండా ఆ కొడుకు మృగంలా వ్యవహరించాడు. ఎత్తుకుని పెంచిన తల్లి గుండెలపైనే ఆ కసాయి కొడుకు కాలితో తన్నిన్నాడు. తనను కొట్టవద్దనని  ఆ తల్లి వేడుకుంటూ దండం పెడుతున్నా ఆ కసాయి కొడుకు కనికరించలేదు. అంతేకాక మరింత రెచ్చిపోయి.. ఆ మాతృమూర్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. బూతులు తిడుతూ సోదరుడికి భూమి ఎలా రాశారంటూ తల్లిని ఈడ్చుకుంటా కెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిపై వీడు మనిషేనా అంటూ నెటినజ్లు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments