కాకినాడలో దారుణం.. పెళ్లి రోజు నాడే భార్యను దారుణంగా

కాకినాడలో దారుణం.. పెళ్లి రోజు నాడే భార్యను దారుణంగా

అనుమానం అనే పేను భూతంతో పెళ్లి రోజునాడే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పై ఓ భర్త చేసిన పనికి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది రేపింది.

అనుమానం అనే పేను భూతంతో పెళ్లి రోజునాడే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పై ఓ భర్త చేసిన పనికి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది రేపింది.

ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. వీటి వలన మంచిగా ఉన్న కాపురాల్లో కూడా తగదాలు వస్తున్నాయి.అయితే చాలామంది కట్టుకున్నవాడిని మోసం చేస్తూ చాలా తప్పులు చేస్తుంటారు. కొందరు ఎలాంటి తప్పులు చేయకుండానే కట్టుకున్న వాడి చేతిలో బలైపోతారు. అందుకు కారణం అనుమానం. ఈ అనుమానం అనేది ఒక పెనుభూతం లాంటింది. ఇది మంచిగా ఉన్న సంసారాల్లో కూడా చిచ్చులు తెచ్చి పెడుతుంది. వీటి వలన అనేక ఘోరాలు చోటు చేసుకుంటాయి. చాలా ఇళ్లలో ఈ అనుమానం అనే జబ్బుతో ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. భార్యభర్తల మధ్య ఈ వివాదాలు కారణంగా చాలామంది పిల్లలు దిక్కుముక్కు లేక రోడ్డున పడుతున్నారు.తాజాగా ఈ అనుమానంతోనే ఓ భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ భర్త అతి దారుణంగా హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కాకినాడలోని చోటు చేసుకుంది. పెళ్లిరోజునాడే ఓ భర్త తన భార్య పై అనుమానంతో ఆమెను కడతేర్చాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..కాకినాడలోని పప్పుల మిల్లు ప్రాంతానికి చెందిన బందుల నూకరాజు, దివ్యకు ఎనిమిదేళ్ల క్రితం అనగా.. 2016 ఫిబ్రవరి 29న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా,ఇప్పుడు వీరికి ఒక పాప, బాబు సంతానం ఉన్నారు.ఇక నూకరాజు ఫ్యాబ్రికేషన్‌ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఆ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి రెండు మూడురోజులు ఉండి తిరిగి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలోనే నూకరాజు తన భార్య దివ్యపై అనుమానం పెంచుకున్నాడు . అప్పటి నుంచి తరుచు వీరి ఇంటిలో గొడవలు జరుగుతునే ఉన్నాయి. కాగా, ఎప్పటిలాగే ఈ బుధవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి సర్ది చెప్పారు. ఇక ఆ మరుసటి రోజు అనగా గురువారం ఉదయం బయటకు వెళ్లి వచ్చిన నూకరాజు మళ్లీ తన భార్యతో గొడవ పడ్డాడు. ఇక వారి ఇంట్లో నుంచి పెద్దగా కేకలు వినిపించినా.. అవి ఎప్పుడు ఉండే సాధారణ గొడవలే అని చూట్టు బంధువులు, స్థానికులు అనుకుని పట్టించుకోలేదు. ఇక ఈ గొడవ జరిగిన కొద్ది సేపటికి ఇంట్లో నుంచి దివ్య బయటకు రాగా.. అప్పటికే సిద్ధంగా ఉంచిన కత్తిని తీసుకుని నూకరాజు వీధిలో ఆమెపై దాడి చేశాడు. దీంతో దివ్యకు మెడపై తీవ్ర గాయమై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే లీపు సంవత్సరం కావడంతో నాలుగేళ్ల తర్వాత వచ్చిన ఈ ఫిబ్రవరి 29న వారి వివాహ రెండో వార్షికోత్సవం. కానీ ఆ రోజునే తన భార్యను హతమార్చడం అనేది స్థానికంగా సంచలనంగా మారింది.

అయితే మృతురాలిని కాపాడేందుకు వెళ్లిన తోడికోడలు, తల్లి లక్ష్మిపై కూడా నూకరాజు కత్తితో దాడి చేయగా.. ఆమె చేతి వేలికి గాయాలయ్యాయి. అడ్డొస్తే నిన్నూ చంపేస్తానని బెదిరించడంతో ఆమె ప్రాణభయంతో పక్కకు వెళ్లిపోయారు. ఇక స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కానీ నిందితుడి అరెస్ట్‌పై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వా లేదు. మరి, లేనిపోని అనుమానంతో కట్టుకున్న భర్తే, భార్యను అతి దారుణంగా హత్య చేసిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments