Home Loans At Low Interest Rates: అతి తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే టాప్ బ్యాంకులు ఇవే!

అతి తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే టాప్ బ్యాంకులు ఇవే!

పర్సనల్ లోన్, ఇతర లోన్ల కన్నా హోమ్ లోన్ మీద వడ్డీ అనేది తక్కువ ఉంటుంది. అయితే ఆయా బ్యాంకులను బట్టి వడ్డీ రేటులో తేడా ఉంటుంది. అయితే ఏ బ్యాంకులు అతి తక్కువ వడ్డీకి హోమ్ లోన్లు ఇస్తున్నాయి ఇప్పుడు చూద్దాం.

పర్సనల్ లోన్, ఇతర లోన్ల కన్నా హోమ్ లోన్ మీద వడ్డీ అనేది తక్కువ ఉంటుంది. అయితే ఆయా బ్యాంకులను బట్టి వడ్డీ రేటులో తేడా ఉంటుంది. అయితే ఏ బ్యాంకులు అతి తక్కువ వడ్డీకి హోమ్ లోన్లు ఇస్తున్నాయి ఇప్పుడు చూద్దాం.

సౌండ్ పార్టీలు తప్ప మిగతా వాళ్ళు హోమ్ లోన్ పెట్టుకునే ఇల్లు కట్టుకోవాలి. లేదా కొనుక్కోవాలి. కొంత దాచుకున్న డబ్బు ఉన్నా గానీ హోమ్ లోన్ కి అప్లై చేయాల్సిందే. అందుకోసం ఆయా బ్యాంకులు, హోసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో లోన్ తీసుకునే ముందు మిగతా బ్యాంకుల్లో కూడా ఎంత వడ్డీ పడుతుంది అనేది చూసుకోవాలి. ఆ బ్యాంకుల్లో వడ్డీ ఎంత తక్కువ పడుతుందో అనేది తెలుసుకోవాలి. ఒక బ్యాంకులో 9.8 శాతం, మరో బ్యాంకులో 10 శాతం వార్షిక వడ్డీ అన్నప్పుడు.. 0.2 పాయింట్లే కదా పెద్ద నష్టం ఏముంటుంది అని అనుకోకండి. ఆ 0.2 పాయింట్లే రుణ భారాన్ని పెంచేస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 9.8 శాతం వడ్డీ రేటుతో పదేళ్లకు 50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే.. ఈఎంఐ రూ. 65,523 పడుతుంది. అదే వడ్డీ రేటు 10 శాతం ఉంటే ఇదే 50 లక్షల లోన్ కి నెల వాయిదా రూ. 66,075 అవుతుంది. ఇక్కడ ఎంత తేడా వచ్చిందో చూడండి. కాబట్టి ఆ 0.2 పాయింట్ల దగ్గర కూడా రాజీ పడకూడదు. కేవలం 20 బేసిస్ పాయింట్లు ఎక్కువ ఉంటేనే వేల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. అందుకే ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ ఇస్తున్నాయో తెలుసుకోండి.  

పంజాబ్ నేషనల్ బ్యాంక్:

సిబిల్ స్కోర్, లోన్ అమౌంట్, లోన్ కాలవ్యవధి ఆధారంగా 9.4 శాతం నుంచి 11.6 శాతం వరకూ హోమ్ లోన్ మీద వడ్డీ తీసుకుంటుంది. 800 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తి పదేళ్ల కాలవ్యవధితో 30 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకుంటే కనుక 9.4 శాతం వడ్డీ పడుతుంది.  

ఐసీఐసీఐ బ్యాంక్:

ఈ బ్యాంకు హోమ్ లోన్లపై 9.40 శాతం నుంచి 10.05 శాతం వడ్డీ వేస్తుంది. స్వయం ఉపాధి పొందేవారు కనుక 35 లక్షల లోపు లోన్ తీసుకుంటే కనుక 9.40 నుంచి 9.80 శాతం వడ్డీ పడుతుంది. జీతం తీసుకునే ఉద్యోగులకు అయితే 9.25 నుంచి 9.65 శాతం ఉంటుంది. ఇదే ఉద్యోగులు 35 లక్షల నుంచి 75 లక్షల మధ్య హోమ్ లోన్ ఉంటే కనుక 9.50 నుంచి 9.80 శాతం వడ్డీ పడుతుంది. ఇదే లోన్ కి స్వయం ఉపాధి పొందేవారికి 9.65 నుంచి 9.95 శాతం వడ్డీ పడుతుంది. 75 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకునే ఉద్యోగులకు 9.60 నుంచి 9.9 శాతం వడ్డీ పడుతుంది. ఇదే లోన్ ని సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ తీసుకుంటే 9.75 నుంచి 10.05 శాతం వడ్డీ రేటు ఉంటుంది.   

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:

సిబిల్ స్కోర్ ని బట్టి 9.15 శాతం నుంచి 9.75 శాతం వరకూ వడ్డీ రేటు వేస్తుంది. ఈ రేట్లు 2023 మే 1 నుంచి అమలులో ఉన్నాయి. 

హెచ్డీఎఫ్సీ: 

ఈ బ్యాంకు 9.40 నుంచి 9.95 శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్లు ఇస్తుంది. 

పీఎన్బీ హోసింగ్ ఫైనాన్స్: 

పీఎన్బీ హోసింగ్ ఫైనాన్స్ సంస్థ.. హోమ్ లోన్ తీసుకునే వ్యక్తి జీతం, సిబిల్ స్కోర్ ఆధారంగా 8.50 నుంచి 11.25 శాతం మధ్య వడ్డీ రేటుని నిర్ణయిస్తుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ 825 కంటే ఎక్కువ ఉంటే 8.50 నుంచి 9 శాతం వడ్డీ పడుతుంది. జీతం లేనివారికి మాత్రం 8.80 నుంచి 9.30 శాతం వడ్డీ రేటు పడుతుంది. 

కోటక్ మహీంద్రా బ్యాంక్:

ఒకవేళ కోటక్ మహీంద్రా బ్యాంకు ఖాతాలో జీతాలు క్రెడిట్ అవుతున్నట్లైతే కనుక.. ఉద్యోగులకు హోమ్ లోన్ మీద 8.7 శాతం వడ్డీ పడుతుంది. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ కి 8.75 శాతం వడ్డీ పడుతుంది.

Show comments