Akshaya Tritiya 2024-Physical Gold, Bonds, Mutual Funds: తక్కువ ధరకే బంగారం కావాలా? ఈ అక్షయతృతీయ సందర్భంగా ఓ తీపి కబురు!

Gold: తక్కువ ధరకే బంగారం కావాలా? ఈ అక్షయతృతీయ సందర్భంగా ఓ తీపి కబురు!

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ వేళ తక్కువ ధర బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి. దీని వల్ల మీకు లాభమే తప్ప నష్టం లేదంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు.

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ వేళ తక్కువ ధర బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి. దీని వల్ల మీకు లాభమే తప్ప నష్టం లేదంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు.

అక్షయ తృతీయ.. గత కొన్నాళ్ల నుంచి ఈ పండుగకు దక్షిణాదిలో కూడా భారీగా క్రేజ్‌ పెరిగింది. మరీ ముఖ్యంగా ఈ పర్వదినం నాడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఈ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవడం కోసం జ్యువెలరీ షాపులు భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తరుగు, మేకింగ్‌ ఛార్జీల మీద భారీ ఎత్తున డిస్కౌంట్లు.. పసిడి కొనుగోళ్లపై ఉచిత బహుమతులు ఇవ్వడం వంటి ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇక సెంటిమెంట్‌, ఆఫర్లకు పడిపోయి చాలా మంది అక్షయ తృతీయ నాడు పసిడి కొనుగోలు చేస్తుంటారు. కొందరైతే అప్పు చేసి మరీ గోల్డ్‌ కొంటారు. అయితే ఈ అక్షయ తృతీయ నాడు మీకు తక్కువ డబ్బులో ఎక్కువ బంగారం కొనుగోలు చేసే అవకాశం లభించనుంది. అది ఎలానో తెలియాలంటే ఇది చదవండి

సాధారణంగా మన దేశంలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. దైవ సర్వూపంగా భావిస్తారు. పెట్టుబడిగా కూడా పనికి వస్తుందనే ఉద్దేశంతో సందర్భం దొరికిన ప్రతి సారి గోల్డ్‌ కొనడానికి ఆసక్తి చూపుతారు. ఇక అక్షయ తృతీయ, ధన్‌తేరాస్‌ వంటి పర్వదినాల్లో బంగారం కొనుగోళ్లు భారీగా పెరుగాయి. మన దేశంలో పసిడి కొనుగోలు అంటే కేవలం ఆభరణాలు మాత్రమే అని భావిస్తారు. అయితే ఇలా ఫిజికల్‌ గోల్డ్‌ తీసుకోవడం కన్నా.. బాండ్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో బంగారం కొంటే.. మీరు చెల్లించే ధరకు ఎక్కువ గోల్డ్‌ కొనుగోలు చేసే అవకాశం ఉంది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు.

నగల రూపంలో  కొంటే నష్టాలివే..

ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేస్తే.. దాని కోసం తరుగు, మజూరీ, మేకింగ్‌ ఛార్జీలు వంటివి అదనంగా చెల్లించాలి. వాటిల్లో ఏవైన ఖరీదైన రాళ్లు ఉంటే వాటికి కూడా వెల కడతారు. అంటే పసిడికి ఎంత రేటు పెడతామో.. దానిలో సగం.. మిగతా ఛార్జీల కోసం చెల్లించాల్సి వస్తుంది. పైగా పాత బంగారాన్ని ఎక్స్‌ఛేంజ్‌ చేసే సమయంలో దానికి పూర్తి ధర చెల్లించరు. 90 శాతం మేర ఖరీదు కడతారు. ఫిజికల్‌ గోల్డ్‌ కొనుగోలుతో ఇన్ని నష్టాలు ఉన్నాయి. వీటికి తోడు.. దీన్ని భద్రంగా కాపాడుకోవడం అన్నింటికి మించిన భారం. ఇంట్లో ఎక్కువ బంగారం ఉంటే.. లాకర్లో భద్రపరచాలి. అందుకు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. పైగా వీటిని రోజు ధరించలేము.

బాండ్స్‌, ఫండ్స్‌ ఎంతో మేలు..

ఈ అక్షయ తృతీయ వేళ.. భవిష్యత్తు అవసరాల నిమిత్తం గోల్డ్‌ కొనాలనుకునే వారికి బాండ్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉత్తమం అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో గోల్డ్‌ కొంటే.. ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో డిజిటల్‌ రూపంలో పసిడిలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. డిజిటిల్‌ గోల్డ్‌ బాండ్లకు ఎలాంటి రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు. పైగా వీటి ధర మార్కెట్‌ కదలికలకు అనుగుణంగా ఉంటుంది. అదే ఫిజికల్‌ గోల్డ్‌ ధర అయితే అంతర్జాతీయ మార్కెట్‌ రేటుకు అనుకూలంగా మారుతుంది.

గోల్డ్‌ బాండ్స్‌..

బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మరోక బెస్ట్‌ ఆప్షన్‌ గోల్డ్‌ సావరిన్‌ బాండ్స్‌. దీన్ని 2015లో ప్రారంభించారు. గోల్డ్‌ బాండ్స్‌తో ఉన్న అదనపు ప్రయోజనం ఏంటి అంటే.. దీనిపై మీకు వడ్డీ కూడా చెల్లిస్తారు. పైగా ఎలాంటి క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు.. రక్షణ గురించి కూడా భయపడాల్సిన పని లేదు.

కనుక ఈ అక్షయ తృతీయకు బంగారం కొనాలనుకునే వారు.. ఫిజికల్‌ గోల్డ్‌తో పెద్దగా పని లేకపోతే ఇలా మ్యూచువల్‌ ఫండ్స్‌, బాండ్స్‌ రూపంలో కొనుగోలు చేయడం.. అలవాటు చేసుకొండి. దీని వల్ల మీరు తక్కువ ధరలో ఎక్కువ బంగారాన్ని పొందవచ్చు. పైగా దాని రక్షణ గురించి ఎలాంటి భయం లేకుండా ఉండవచ్చు. కనుక ఈ అక్షయ తృతీయ నుంచి బంగారం కొనాలంటే.. ఇలా అలవాటు చేసుకోవడం మంచిది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. కనుక తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకొండి.

Show comments