SRH vs LSG: వాళ్లను చూస్తుంటే భయమేస్తోంది! కమిన్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

SRH vs LSG: వాళ్లను చూస్తుంటే భయమేస్తోంది! కమిన్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Travis Head, Abhishek Sharma, Pat Cummins, SRH vs LSG: లక్నో సూపర్‌ జెయింట్స్‌పై సంచలన విజయం తర్వాత సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాన్‌ కమిన్స్‌ వాళ్లిద్దరిని చూస్తే భయమేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

Travis Head, Abhishek Sharma, Pat Cummins, SRH vs LSG: లక్నో సూపర్‌ జెయింట్స్‌పై సంచలన విజయం తర్వాత సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాన్‌ కమిన్స్‌ వాళ్లిద్దరిని చూస్తే భయమేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన విజయం సాధించింది. బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచింది ఎస్‌ఆర్‌హెచ్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నోను సూపర్ బౌలింగ్‌తో 165 పరుగులకే కట్టడి చేసిన సన్‌రైజర్స్‌.. 166 పరుగుల టార్గెట్‌ను ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ 9.4 ఓవర్లలోనే ఊదిపారేశారు. 16 ఫోర్లు, 14 సిక్సులతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి దెబ్బకు లక్నో బౌలర్లు బాల్‌ ఎక్కడ వేయాలో అర్థం కాక అతలాకుతలం అయ్యారు. ఈ మ్యాచ​్‌ విజయం తర్వాత.. కమిన్స్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

లక్నోతో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ సృష్టించిన విధ్వంసం చూసి.. ఒక బౌలర్‌గా తనకు భయమేస్తుందని కమిన్స్‌ చెప్పుకొచ్చాడు. ఇద్దరు ఓపెనర్లు ఎంతో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారని, తొలి ఇన్నింగ్స్‌కు, రెండో ఇన్నింగ్స్‌కు పిచ్‌లో ఎలాంటి మార్పు లేదని, కేవలం హెడ్‌, అభిషేక్‌ తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో పిచ్‌ను మార్చేశారని సరదాగా పేర్కొన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ అతి తక్కువ ఓవర్లలో 160 ప్లస్‌ టార్గెట్‌ను ఛేజ్‌ను చేసి మ్యాచ్‌ గెలిచిందంటే.. అందుకే కారణం హెడ్‌, అభిషేక్‌ల అగ్రెసివ్‌ ఇంటెంటే. వీరి అగ్రెసివ్‌ బ్యాటింగ్‌తో.. సన్‌రైజర్స్‌ రన్‌రేట్‌ కూడా భారీగా మెరుగుపడింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 75 పరుగులు, ట్రావిస్‌ హెడ్‌ 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సులతో 89 పరుగులు చేసి.. 9.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ 29, క్వింటన్‌ డికాక్‌ 2, స్టోయినీస్‌ 3, కృనాల్‌ పాండ్యా 24 పరుగులు మాత్రమే చేసిన నిరాశపర్చారు. చివర్లో పూరన్‌ 26 బంతుల్లో 48, ఆయూష్‌ బదోని 30 బంతుల్లో 55 పరుగులు చేసి ఆ మాత్రం స్కోర్‌ అందించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2, కెప్టెన్‌ కమిన్స్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక 166 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 167 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ 75, ట్రావిస్‌ హెడ్‌ 89 పరుగులతో విధ్వంసం సృష్టించారు. ఈ భారీ విజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 14 పాయింట్లతో పాయింట్లలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. మరి ఈ మ్యాచ్‌లో హెడ్‌, అభిషేక్‌ బ్యాటింగ్‌ చూసి బౌలర్‌గా తనకు భయమేస్తుందని కమిన్స్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments