ఐకాన్ స్టార్ తో మూడో సారి కలిసి నటించనున్న హీరోయిన్?

ఐకాన్ స్టార్ తో మూడో సారి కలిసి నటించనున్న హీరోయిన్?

పూజా గతంలో అల్లు అర్జున్‌తో కలిసి డీజే, అల వైకుంఠపురంలో సినిమాలలో నటించారు. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అయితే, ఆమెకు మూడో సారి అల్లు అర్జున్ సరసన హీరోయిన్ అయ్యే అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

పూజా గతంలో అల్లు అర్జున్‌తో కలిసి డీజే, అల వైకుంఠపురంలో సినిమాలలో నటించారు. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అయితే, ఆమెకు మూడో సారి అల్లు అర్జున్ సరసన హీరోయిన్ అయ్యే అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

సినీ పరిశ్రమలో హీరో – హీరోయిన్ లేదా హీరో – డైరెక్టర్ కాంబినేషన్లు రిపీట్ అవడం అనేది మామూలే. సినిమాల రిజల్ట్ బట్టి అదే కాంబినేషన్ మరో సారి చూడాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే అల్లు అర్జున్ – పూజా హెగ్డే జోడీ పై జరగనుందని టాక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో మోస్ట్ క్రేజీ సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానున్నట్లు ప్రకటించారు.

అయితే షూటింగ్ లో కాస్త ఆలస్యం జరిగినా సరే చెప్పిన డేట్ కి సినిమా వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తదుపరి చిత్రంతో పాటు అందులో నటించనున్న హీరోయిన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ వస్తున్నాయి.పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తరువాతి సినిమాకి త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా, బోయపాటి శ్రీనుల పేర్లు ఇప్పటికే వినిపించాయి. త్రివిక్రమ్, వంగాల సినిమాలు అఫిషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. కాగా మిగిలిన రెండు చిత్రాలను త్వరలో ప్రకటించనున్నారు. అయితే అల్లు అర్జున్ మొదట కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీతో కలిసి సినిమా చేయడానికే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

పూజా గతంలో అల్లు అర్జున్‌తో కలిసి డీజే, అల వైకుంఠపురంలో సినిమాలలో నటించారు. కాగా ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇటీవల వైరల్ అవుతున్న వార్తలే నిజమైతే.. ఆమెకు మూడో సారి అల్లు అర్జున్ సరసన హీరోయిన్ అయ్యే అవకాశం కొట్టేసినట్లే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఈ విషయం పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి ముచ్చటగా మూడోసారి అల్లు అర్జున్ – పూజా హెగ్డేల ఎనర్జిటిక్ కాంబినేషన్ స్క్రీన్ పై చూడాలని ఆశిస్తున్న అభిమానుల కోరిక తీరుతుందో లేదో చూద్దాం.

Show comments