Bihar Crime News: దారుణం.. మహిళలకు బలవంతంగా మూత్రం తాగించారు! ఎక్కడంటే!

దారుణం.. మహిళలకు బలవంతంగా మూత్రం తాగించారు! ఎక్కడంటే!

దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు సభ్య సమాజం తలదించుకునేలా కామాంధులు లైంగిక దాడులకు పాల్పపడుతున్నారు. భారత్ అగ్ర దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో ముందుసాగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ దళితులపై వివక్ష, దాడులు, అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మద్య మధ్యప్రదేశ్ లో పరేశ్ శుక్లా అనే ఓ ఆదివాసిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ అమానవీయ ఘటన మరువక ముందే బీహార్ లో ఓ మహిళపై అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకోవడం తీవ్ర కలకం రేపింది. వివరాల్లోకి వెళితే..

బీహార్ రాజధాని పాట్నాలో శనివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ. 1500 అప్పు చెల్లించలేదని ఓ దళిత మహిళను తండ్రీ కొడుకులు దారుణంగా అవమానించారు. అందరూ చూస్తుండగా ఆమెను వివస్త్రం చేసి కర్రలతో కొట్టారు. మహిళ తలకు బలమైన గాయాలు కాగా, ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుం ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నింధితులు ప్రమోద్ సింగ్, అతని కుమారుడు అన్షు తో పాలు మరో నలుగురు శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో దళిత మహిళ ఇంటికి వెళ్లి బలవంతంగా వారి ఇంటికి తీసుకువెళ్లారు. అందరూ చూస్తుండగా ఆమెను కర్రలతో కొట్టారు.. బలవంతంగా నోటిలో మూత్ర విసర్జన చేశారు. ఎలాగో అలా ఆ మహిళ వారి చెర నుంచి తప్పించుంది.  ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘటనలో మహిళ తలకు బలమైన గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంత దారుణానికి తెగబడిన తండ్రి కోడుకులు వారికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు పెద్ద ఎత్తు ఆందోళన చేపట్టాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రధాన నింధితులతో సహ మరో నలుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. త్వరలోనే నింధితులను పట్టుకొని కఠినంగా శిక్ష విధిస్తామని అన్నారు. ఈ దారుణ ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి యోగేంద్ర పాశ్వాన్ ఖండించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ లపై మండి పడ్డారు.

Show comments