OTTలోకి ది బాయ్స్ వెబ్ సిరీస్ 4.. ఏకంగా ఆరు భాషల్లో స్ట్రీమింగ్!

The Boys 4: OTTలోకి ది బాయ్స్ వెబ్ సిరీస్ 4.. ఏకంగా ఆరు భాషల్లో స్ట్రీమింగ్!

ఓటీటీ లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ 4వ సీజన్ ఓటీటీ లోకి రానుంది. ఆ వెబ్ సిరీస్ గురించి చూసేద్దాం.

ఓటీటీ లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ 4వ సీజన్ ఓటీటీ లోకి రానుంది. ఆ వెబ్ సిరీస్ గురించి చూసేద్దాం.

ఓటీటీ లోకి వచ్చే సినిమాలు, సిరీస్ లు అన్నీ కూడా తెలుగులో మాత్రమే ఉండవు.. అన్ని భాషలకు సంబంధించిన చిత్రాలు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఓటీటీ లవర్స్ కూడా ఏ లాంగ్వేజ్ లో వచ్చినా ఆయా సినిమాలను, సిరీస్ లను.. ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ లో వస్తున్న సిరీస్ లను ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొతమంది సూపర్ హీరోలపైన సెటైరికల్ గా తెరకెక్కిన సిరీస్ “ది బాయ్స్”. ఈ సిరీస్ మొదలైనప్పటినుంచి.. ఈ సిరీస్ కు దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. దీనితో ఈ సిరీస్ ను వరుసగా మూడు సీజన్స్ ను తెరకెక్కిచారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సిరీస్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్, దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సూపర్ హీరోస్ కథలతో తెరకెక్కే సినిమాలు, సిరీస్ లు ఎప్పుడు సూపర్ సక్సెస్ నే సాధిస్తున్నాయి . స్పైడర్ మ్యాన్ , బ్యాట్ మ్యాన్ ఇలాంటి సూపర్ హీరోస్ తో కొన్ని కథలను తెరకెక్కించిన మేకర్స్ కు.. వాటి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దీనితో ఇలాంటి కథలను ఇంకాస్త ఇంట్రెస్టింగ్,.. కొత్త క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ సినిమాలను, సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ది బాయ్స్‌లో కార్ల్ అర్బన్, జాక్ క్వైడ్, ఆంటోనీ స్టార్, ఎరిన్ మొరియార్టీ, జెస్సీ టి అషర్, లాజ్ అలోన్సో, చాస్ క్రాఫోర్డ్, టోమర్ కాపోన్, కరెన్ ఫుకుహర, కోల్బీ మినీఫీ, క్లాడియా డౌమిట్, కామెరాన్ క్రోవెట్టి నటించారు. ఈ సిరీస్ ను ఇప్పటికే చూసి ఉన్న వారికి వీరి గురించి తెలుస్తుంది. ప్రపంచాన్ని రక్షించే సూపర్ హీరోస్ గా వీరు ఈ సిరీస్ లో నటించారు. ఇక ఇప్పుడు ఈ సిరీస్ కు.. 4 వ సీజన్ అంటే.. ది బాయ్స్ 4 ను అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా దీనికి సంబంధించన ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో పాటు.. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈ సరికొత్త సీజన్ జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

పైగా ది బాయ్స్ సిరీస్ కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఈ సిరీస్ ఇంగ్లీష్ తో పాటు.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 13 నుంచి జూలై 18న ది బాయ్స్ 4 సీజన్‌లోని అన్ని ఎపిసోడ్స్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ది బాయ్స్ సీజన్ 4 ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సిరీస్ మొదటి మూడు సీజన్స్ ను పూర్తి చేసుకుని నాలుగువ సీజన్ వరకు వచ్చిందంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఈ సిరీస్ ఎంత ఫేమస్ అయ్యి ఉంటుందో. ఈ సిరీస్ ను ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సిరీస్ సీజన్ 4 అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments