కూతురి కాళ్లు మొక్కిన తల్లిదండ్రులు.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

సాధారణంగా అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు అమ్మాయి తల్లిదండ్రులు. అప్పగింతల సమయంలో కూతుర్ని వారి చేతిలో పెడుతూ.. కన్నీటి పర్యంతమౌతుంటారు. కానీ ఆ సామాజిక వర్గంలో మాత్రం..

సాధారణంగా అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు అమ్మాయి తల్లిదండ్రులు. అప్పగింతల సమయంలో కూతుర్ని వారి చేతిలో పెడుతూ.. కన్నీటి పర్యంతమౌతుంటారు. కానీ ఆ సామాజిక వర్గంలో మాత్రం..

ఆడ పిల్లను పెంచి పెద్ద చేసిన తండ్రి.. కూతురికి ఓ మంచి వ్యక్తిని చూసి ఘనంగా పెళ్లి చేస్తాడు. ఇక పెళ్లిని ధూమ్ ధామ్‌గా జరిపిస్తాడు.  వరుడికి, అతడి కుటుంబ సభ్యులు, బంధువులకు ఎటువంటి లోటు పాట్లు జరగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు. వెళ్లిన చోట కూతురు సుఖ పడాలన్న ఉద్దేశంతో.. అబ్బాయి అడిగిన కట్నం ఇవ్వడంతో పాటు పెట్టిపోతలకు ఎలాంటి లోటు రానివ్వడు. ఇక ఆమెకు తమ సాంప్రదాయల ప్రకారం పెళ్లి తతంగాన్ని జరిపిస్తుంటారు. అల్లుడికి రాచ మర్యాదలు చేయడమే కాదూ.. కాళ్లు కడిగి కన్యాదానం చేసి.. తమ మహాలక్ష్మిని వారి చేతుల్లో పెడుతుంటారు. కానీ ఈ కమ్యూనిటీలో అత్తారింటికి పంపే కూతురిపై కాళ్ల మొక్కుతారు చిన్నా,పెద్ద కూడా.

భారత దేశంలో ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనుగడలో ఉన్నాయి. అలాగే వివాహ తంతు కూడా వివిధ రూపాల్లో, వివిధ పద్దతుల్లో.. అనేక సాంప్రదాయాల ప్రకారం జరుగుతూ ఉంటుంది. సామాజిక వర్గాన్ని బట్టి.. వివాహ తంతు మారుతూ ఉంటుంది. సాధారణంగా ఆడ పిల్లను అత్తారింటికి పంపేటప్పుడు కన్నీరుమున్నీరు అవుతారు తల్లిదండ్రులు. అప్పగింతల సమయంలో ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూనే ఆమెను అత్తారింటికి సాగనంపుతారు. కానీ ఈ సామాజిక వర్గంలో అల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేయడమే కాకుండా..అత్తారింటికి వెళ్లే కూతురి కాళ్లపై పడతారు. చిన్నా,పెద్దా, ముతకా, ముసలి అందరూ కూడా పెళ్లి కూతురి పాదాలకు మొక్కుతారు.

తాజాగా అటువంటి వినూత్నమైన సాంప్రదాయానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇంతకు ఆమె కాళ్ల మీద ఎందుకు పడతారంటే.. ఇన్నాళ్ల పెంపకంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని కూతుర్ని కోరుతూ.. ఆమె తల్లిదండ్రులు, అన్నాదమ్ములు, తాత, అవ్వలు పాదాలపై పడి క్షమాపణలు చెబుతారు. ఇది ఆమెపై ఉన్న ప్రేమ, గౌరవానికి నిదర్శనమని భావిస్తుంటారు. ఇంతకు ఈ సాంప్రదాయం ఎక్కడ అంటే.. గుజరాత్‌లోని కచ్ పటేల్ కమ్యూనిటీలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. వినడానికి వింతగా అనిపించిన ఈ ఆచారానికి సంబంధించిన వీడియో చూస్తే మనకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

Show comments