గుండెపోటు వచ్చినా.. 20 మందిని కాపాడి..! చివరకు..

RTC Driver: ఓ డ్రైవర్ కి ఛాతిలో ఒక్కసారిగా నొప్పి మొదలైంది. శ్వాస తీసుకోవటం కూడా కష్టంగా మారింది. శరీరం మొత్తం చల్లని చెమటలు పట్టేస్తున్నాయి. చూపు మసకబారిపోతోంది. అయినా ఆయది ఒకటే ఆలోచన.. తన బస్సులో ఉన్న వాళ్లకు ఏమీ కావొద్దు. అందుకే ప్రాణాలే పోతున్నా.. 20 మందిని కాపాడి.. చివరికి

RTC Driver: ఓ డ్రైవర్ కి ఛాతిలో ఒక్కసారిగా నొప్పి మొదలైంది. శ్వాస తీసుకోవటం కూడా కష్టంగా మారింది. శరీరం మొత్తం చల్లని చెమటలు పట్టేస్తున్నాయి. చూపు మసకబారిపోతోంది. అయినా ఆయది ఒకటే ఆలోచన.. తన బస్సులో ఉన్న వాళ్లకు ఏమీ కావొద్దు. అందుకే ప్రాణాలే పోతున్నా.. 20 మందిని కాపాడి.. చివరికి

ఇటీవల కాలంలో గుండె పోటు కారణంగా జరుగుతున్న మరణాల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా పది నెలల పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అందరిలో ఈ హార్ట్ ఎటాక్ అనేది కనిపిస్తుంది. ఇటీవలే మూడో తరగతి చదువుతున్న బాలుడు గుండె పోటు కారణంగా మరణించాడు. అలానే ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఛాతీలో నొప్పి అంటూనే సీట్లోనే కుప్పకూలిపోయాడు. ఆయన ప్రాణాలు పోతున్నా కూడా బస్సులో ఉన్న 50 మంది ప్రాణాలు రక్షించాలని భావించాడు. అలానే వారిని కాపాడి.. ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా నల్గొండ జిల్లాలో అదే తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. హార్ట ఎటాక్ కి గురైన ఓ డ్రైవర్..20 మంది ప్రాణాలు కాపాడి.. చివరకు తిరిగి రానిలోకాలకు వెళ్లాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నల్గొండ జిల్లా  దేవరకొండ డిపోలో శంకర్ నాయక్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆయన ఎక్కువగా మల్లెపల్లి నుంచి హైదరాబాద్‌కు సర్వీస్ చేస్తుంటారు. అలానే శనివారం కూడా మల్లెపల్లి నుంచి హైదరాబాద్ కు  ఎక్స్ బస్ లో బయలుదేరాడు.  ఆ  బస్సు ఇబ్రహీంపట్నం దాటగానే డ్రైవర్‌ శంకర్ నాయక్‌కు ఛాతిలో నొప్పి మొదలైంది. అయితే.. అదే సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓవైపు గుండెల్లోభయంకరమైన నొప్పితో శంకర్ నాయక్ తల్లడిల్లిపోయాడు. అలానే పరిస్థితి చేజారిపోతుందని  భావించి.. బస్సులోని ప్రయాణికులను ఎలాగైన కాపాడాలని భావించాడు.

ఆ ఒకే ఒక్క కారణంతో.. తన ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకుని బస్సును రోడ్డు పక్కకు తీసి నిలిపాడు. ప్రయాణికులందరూ సురక్షితం అని నిర్ధారించుకున్న శంకర్ నాయక్.. తాను పట్టుకున్న స్టీరింగ్ మీదే వాలిపోయారు. ఇక ఆయనను గమనించి కండక్టర్, బస్సులోని ప్రయాణికులు 108కి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడి చేరుకున్న 108లో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. బస్సులో స్టిరింగ్ మీద వాలిపోయినప్పుడే ఆ గుండె ఆగిపోయిందని వైద్యులు వెల్లడించారు. శంకర్ నాయక్‌ మృతితో ఆయన కుటుంబంతో పాటు దేవరకొండ డిపోలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

చివరి శ్వాస వరకూ విధుల్లో ఉండటమే కాకుండా, ప్రాణాలు పోతున్నా కూడా ప్రయాణికులను రక్షించిన శంకర్ నాయక్‌కు అందరూ సెల్యూట్ కొడుతున్నారు. మనసుల్ని మెలిపెట్టే శంకర్ నాయక్ మృతిపై పలువురు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ నాయక్ చివరి శ్వాస విడిచేటప్పుడు కూడా ప్రయాణికుల ప్రాణాల గురించే ఆలోచించారు. ఇటీవల ఖమ్మం జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. గత నాలుగైదు రోజుల్లోనే గుండెపోటుకు గురై.. ఓ పదేళ్ల బాలుడితో పాటు టీనేజీ యువకుడు, ఓ ఆర్టీసీ డ్రైవర్ ఇలా పలువురు మృతి చెందటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Show comments