బంధువులు ఇంటికి వెళ్లడమే వారు చేసిన తప్పా?

బంధువులు ఇంటికి వెళ్లడమే వారు చేసిన తప్పా?

ప్రతి ఒక్కరూ వీకెండ్ వస్తే.. తమ బంధువుల ఇళ్లకు వెళ్లి..సంతోషంగా గడపాలని అనుకుంటారు. అయితే అలానే ఓ కుటుంబం కూడా బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే అదే వారు చేసిన తప్పా అన్నట్లు ఓ ఘటన జరిగింది. సంతోషంగా వెళ్లిన వారికి.. చివరకు విషాదం మిగిలింది.

ప్రతి ఒక్కరూ వీకెండ్ వస్తే.. తమ బంధువుల ఇళ్లకు వెళ్లి..సంతోషంగా గడపాలని అనుకుంటారు. అయితే అలానే ఓ కుటుంబం కూడా బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే అదే వారు చేసిన తప్పా అన్నట్లు ఓ ఘటన జరిగింది. సంతోషంగా వెళ్లిన వారికి.. చివరకు విషాదం మిగిలింది.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. ఇక  ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తుంటారు. ఇటీవలే హైదరాబాద్ భరత్ నగర్ ఫ్లై ఓవర్ పై ఓ యువతి విధులకు వెళ్తుండగా… ఓ ట్యాంకర్ ఢీ కొట్టడంతో దుర్మరణం చెందింది. తాజాగా ఓ ఆసిఫా బాద్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

ఆదివారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ చెక్ పోస్టు వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాగజ్ నగర్ మండలం బట్టుపల్లికి చెందిన సహెరా భాను(35), తన కుమారుడు షేక్ ఆసిఫ్(16), భర్త సర్వతో కలిసి జీవనం సాగిస్తోంది. శనివారం సర్వర్‌ తన భార్య, కుమారుడితో కలసి ఆసిఫాబాద్‌ మండలం చిర్రకుంటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ రోజు రాత్రి అక్కడే బంధువులతో సంతోషంగా గడిపారు. తిరిగి ఆదివారం ఉదయం టిఫిన్ చేసుకుని వారి స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తమకు అవే చివరి క్షణాలని ఆ తల్లీకొడుకు ఊహించలేకపోయారు. ఆదివారం ఉదయం మోటార్‌సైకిల్‌పై తిరిగి బట్టుపల్లికి బయల్దేరారు.

హైవేపై గల ఎగ్జిట్‌ రోడ్డు వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న ఓ కంటైనర్‌ లారీ.. వీరు ప్రయాణిస్తున్న బైక్ నుంచి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ వెనక టైర్లు కిందికి తల్లి, కొడుకులు వెళ్లిపోయారు. దీంతో ఆ టైర్లు వారిపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందారు. భర్త సర్వర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అలానే ఆ కంటెయినర్ బైక్ పై నుంచి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న మరో లారీని కూడా ఢీ కొట్టింది. ఈప్రమాదంలో ఆ లారీలోని డ్రైవర్, క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిక తరలించారు. మృత దేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఎస్సైలు మహేందర్, ప్రవీణ్‌ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని రాజంపేట చెక్‌పోస్టు మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గాన్ని మూసి వేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక నిర్జీవంగా పడి ఉన్న ఆ తల్లీ కొడుకులు మృతదేహాలను చూసిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువుల ఇంటికి వెళ్లడమే వారు చేసిన తప్పా.. సంతోషంగా వెళ్లిన ఆ ఇంట.. చివరకు విషాదం మిగిలిందంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments