IMD Rain Alert: తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌.. నేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

TG IMD Forecast Heavy Rains Issues Orange Alert: తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

TG IMD Forecast Heavy Rains Issues Orange Alert: తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. ఈసారి జూన్‌ నెల ప్రారంభం నుంచే వర్షాలు కురవడం మొదలయ్యింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం ఆశించిన మేర నమోదు కాలేదు. అయితే జూలైలో జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దానికి తగ్గట్టుగానే.. ఈ రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఈ నెల 19 వరకు అనగా శుక్రవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నేడు అనగా జూలై 17, బుధవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. అలానే రేపటి నుంచి అనగా.. జూలై 18 నుంచి మూడ్రోజుల పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం (జూలై 16) దక్షిణ ఒడిశా పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలో కేంద్రీకృతమైందని.. ఉపరితల ఆవర్తం సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఉందని చెబుతున్న వాతావరణ శాఖ.. ఈ నేపథ్యంలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేయడం మాత్రమే కాక.. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది.

ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో 11.5-20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. నేడు అనగా బుధవారం నాడు.. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు,నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, జనగాం, కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నేడు వర్షంతో పాటుగా భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటం, కరెంట్ సరఫరా స్తంభించటం వంటి జరగొచ్చని.. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడటం వంటివి జరగవచ్చునని.. కనుక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Show comments