Telangana Heavy Rains: తెలంగాణలో ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్! పిడుగులతో కుండపోత వర్షం..!

తెలంగాణలో ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్! పిడుగులతో కుండపోత వర్షం..!

Telangana Heavy Rains: తెలంగాణలో మే నెల చివరి వారంలో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి.

Telangana Heavy Rains: తెలంగాణలో మే నెల చివరి వారంలో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి.

ఈ ఏడాది మార్చి నుంచి ఎండలు దంచికొట్టాయి.. ఏప్రిల్ నెలో భానుడు ప్రతాపంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోయింది. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. మిట్ట మధ్యాహ్నం రోడ్లన్నీ కర్ఫ్యూ పెట్టినట్టు కనిపించాయి. మే నెలలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ ప్రభావం వల్ల వచ్చే మూడు రోజులు రాష్ట్రమంతటా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.  ఈ రోజు (బుధవారం, జూన్ 12) నుంచి  గురు, శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతీ రుతుపవనాలు విస్తరించడం వల్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి రాష్ట్రంలో 16 జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్,హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో భారీ వర్షం పడొచ్చని పేర్కొంది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇదిలా ఉంటే తెలంగాణలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బొమ్మల రామారంలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయ్యింది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఇద్దరు రైతులు పిడుగుపాటుకు చనిపోయారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని హైదారాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరిస్తుంది. వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీటితో నిండిపోయి ఉంటాయి.. మ్యాన్ హూల్స్ విషయంలో జీహెచ్ఎంసీ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

Show comments