Telangana: బస్ స్టాండ్ లో జన్మించిన పాపకు TGS RTC అరుదైన గౌరవం!

బస్ స్టాండ్ లో జన్మించిన పాపకు TGS RTC అరుదైన గౌరవం!

Telangana, TGSRTC: ఇటీవల కరీంనగర్ బస్‌ స్టాండ్‌లో ఓ మహిళ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన రెండు రోజులకే ఈ పాప బంపర్ ఆఫర్ కొట్టేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

Telangana, TGSRTC: ఇటీవల కరీంనగర్ బస్‌ స్టాండ్‌లో ఓ మహిళ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన రెండు రోజులకే ఈ పాప బంపర్ ఆఫర్ కొట్టేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ) తరచూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక మార్పులు తీసుకొస్తుంది. అంతేకాక ప్రయాణికులను ఆకట్టుకునేలా పలు స్కీమ్స్ ను ఆఫర్లను అందిస్తుంది. ఇవ్వన్ని పక్కన పెడితే.. ఇటీవలే కరీంనగర్ బస్టాండ్ లో బాలింత డెలివరి అయిన సంగతి తెలిసింది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. పురుడు పోసిన ఆర్టీసీ మహిళా సిబ్బందిని అభినందించారు. తాజాగా ఆ బస్ స్టాండ్ లో జన్మించిన చిన్నారికి అరుదైన గౌరవం అందించింది తెలంగాణ ఆర్టీసీ. మరి.. ఆ బహుమతి ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇటీవల కరీంనగర్ బస్‌ స్టాండ్‌లో ఓ మహిళ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఊరెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చిన ఆ మహిళకు అకస్మాత్తుగా పురిటినొప్పులు వచ్చాయి. దీంతో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది ఆమెకు పురుడు పోశారు. దీంతో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తల్లీబిడ్డల ఆరోగ్యం  బాగానే ఉంది. బస్టాండ్‌లో పుట్టిన చిన్నారి కోసం తాజాగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ చిన్నారికి తమ ఆర్టీసీ బస్సుల్లో లైఫ్ టైమ్ ఫ్రీ జర్నీ చేసేలా బస్‌పాస్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్‌ స్టేషన్ లో పుట్టిన పిల్లలకు తమ జీవిత కాలంలో ఉచితంగా బస్‌ పాస్‌ ఇవ్వాలని గతంలోనే ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ చిన్నారికి పుట్టిన రోజు బహుమతిగా జీవితకాల ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇక ఈ బస్ స్టాండ్ లో జన్మించిన పాప విషయానికి వస్తే.. జూన్ 16న కూమారి అనే గర్భిణీ, తన భర్తతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు కరీంనగర్ బస్ స్టేషన్‌కు వచ్చింది. ఇక బస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆమెకు అకస్మాత్తుగా నొప్పులు వచ్చాయి. ఇక ఆ మహిళా పరిస్థితిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ లోపు నొప్పులు ఎక్కువ కావడంతో  ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా పండంటి ఆడబిడ్డ జన్మించింది. అనంతరం అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించంగా. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరి.. ఆర్టీసీ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments