ప్రయాణికులకు అలర్ట్.. మూడు రోజుల పాటు ఆ స్పెషల్ రైళ్లు రద్దు

ప్రయాణికులకు అలర్ట్.. మూడు రోజుల పాటు ఆ స్పెషల్ రైళ్లు రద్దు

Indian Railway: ఈ మధ్య కాలంలో తరుచుగా పలు ప్రాంతల్లో రైల్లు రద్దు కావడం, దారి మళ్లించడం వంటివి చేస్తూ ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ తాజాగా పలు మార్గాల్లో స్పెషల్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Indian Railway: ఈ మధ్య కాలంలో తరుచుగా పలు ప్రాంతల్లో రైల్లు రద్దు కావడం, దారి మళ్లించడం వంటివి చేస్తూ ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ తాజాగా పలు మార్గాల్లో స్పెషల్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఎటువంటి టెన్షన్ లేకుండా..ప్రశాంతంగా అతి తక్కువ ధరతోనే ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరేందుకు ట్రైన్ జర్నీ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పవచ్చు. అందుకే ఎక్కువ శాతం ప్రయాణికులు ఈ ట్రైన్ జర్నీనే ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే దేశంలో సామాన్య ప్రయాణికుల దగ్గర నుంచి చిరు వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు వంటి వారు నిత్యం ప్రయాణాలను కొనసాగిస్తుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో ఈ రైల్వే శాఖకు సంబంధించి ఏదో ఒక వార్తలు బిగ్ అలర్ట్ వినిపిస్తునే ఉన్నాయి.

ముఖ్యంగా వాటిలో రైల్వే ప్రమాదాలు, రైళ్లు రద్దు వంటి వార్తులు ఎక్కువ ఉన్నాయనే చెప్పవచ్చు. అయితే పలు పాంత్రాల్లో ట్రాక్ మరమత్తులు, రైల్వే స్టేషన్స్ నిర్మాణం కారణంగా.. ఆయా ప్రాంతాల గుండా వెళ్తున్న రైల్లను దారి మళ్లించడం, మరి కొన్ని రైళ్లను రద్దు చేయడం వంటివి చేస్తూ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కీలక అప్డేట్ లను జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా రైల్వేశాఖ పలు స్పెషల్ రైల్లను రద్దు చేస్తున్నట్లు  ప్రయాణికులకు కీలక అప్డేట్ ను జారీ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు మార్గాల్లో నడుస్తున్న స్పెషల్ రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, అవి తిరుపతి-కాచిగూడ, కాకినాడ టౌన్-సికింద్రాబాద్– -కాకినాడ టౌన్, నర్సాపూర్– -సికింద్రాబాద్– -నర్సాపూర్ రైళ్లు నేటి నుంచి అనగా ఆగస్టు 17 నుంచి 19 వరకు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ తెలిపారు. అంతేకాకుండా.. ఆయా రైళ్లలో ప్రయాణించలనే ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా వేరో రైళ్లలో ప్రయాణించేలా చూసుకోవాలని సూచించారు. అయితే ఈ రైల్లు టెక్నికల్ సమస్యల కారణంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇకపోతే ఇండిపెండెన్స్ డే స్పెషల్ రైళ్లు ఈనెల 17 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.  మరీ, టెక్నీకల్ సమస్యల కారణంగా ఆయా ప్రాంతల్లో ఈ స్పెషల్ రైళ్లు రద్దు కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments