తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాలో వర్షాలే వర్షాలు!

IMD Predicted Rains: గత నెల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి.. బయటికి వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రత ఏకంగా 46 డిగ్రీలు నమోదు అవుతుంది. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.

IMD Predicted Rains: గత నెల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి.. బయటికి వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రత ఏకంగా 46 డిగ్రీలు నమోదు అవుతుంది. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.

మార్చి నెల నుంచి ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ నుంచి భానుడి ప్రతాపం మరింతగా చూపిస్తున్నాడు. ప్రతిరోజూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయంటే ఎండ వేడి ఎంతగా పెరిగిపోయిందో అర్థమవుతుంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ మొదలై మధ్యాహ్నం బీభత్సం సృష్టిస్తుంది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి తాపం తట్టుకోలేక శీతలపానియాల వెంట పరుగులు తీస్తున్నారు. కొన్ని రోడ్లు అయితే కర్ఫ్యూ విధించినట్లు నిర్మానుశ్యంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి మండుటెండల్లో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెల నుంచి సూర్యప్రతాపం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉన్నా కూడా అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేపోతున్నారు. ఇలాంటి మండుటెండల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి వర్ష సూచన అందించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదరు గాలులతో భారీ వర్షాలు నమోదు అయ్యే సూచన ఉందని తెలిపింది. రేపు రాష్ట్రంలోని 7 జిల్లాలకు భారీ వర్ష సూచన ప్రకటించింది వాతావరణ శాఖ. వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, జనగాం, నల్లగొండ, యాదాద్రి జిల్లా, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలింది. అలాగే దక్షిణ, ఈశాన్య జిల్లాల్లో తెలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోన రాష్ట్రంలోఆరెంజ్ అలర్ట్ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న తెలంగాణలో 47 డిగ్రాలు దాటి ఉష్ణగ్రతలు, జిగిత్యాల జిల్లా వెల్గటూర్ లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

Show comments