IAS Amrapali: తెలంగాణలో పలువురు IASల బదిలీలు.. ఆమ్రపాలికి తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు

తెలంగాణలో పలువురు IASల బదిలీలు.. ఆమ్రపాలికి తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు

తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ఆ వివరాలు మీకోసం..

తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ఆ వివరాలు మీకోసం..

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటుంది. డిసెంబర్ 07న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో ముందుకెళ్తున్నారు. తాజగా రేవంత్ సర్కార్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలను అప్పగించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా ఆమ్రపాలిని ప్రభుత్వం నియమించింది. కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి తెలంగాణకు వచ్చిన ఆమ్రపాలికి హెచ్ఎండీఏ కమిషనర్ గా నియమించడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల పలువురు ఐపీఎస్ లను బదిలీలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పలువురు ఐఏఎస్ లకు స్థాన చలనం కల్పిస్తూ, పదోన్నతులను కల్పించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఆమ్రపాలికి కీలక బాధ్యతలను అప్పగించింది తెలంగాణ సర్కార్. విద్యుత్ శాఖలోనూ మార్పులు చేసిన ప్రభుత్వం ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా రిజ్వీని నియమిస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులను జారీ చేసింది. ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, డిప్యూటీ సీఎంకు ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కృష్ణ భాస్కర్ ను నియమించారు.

టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ముషారఫ్ అలీ, టీఎస్ఎన్పీడీసీఎల్ వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్ణాటి వరుణ్ రెడ్డి, అగ్రికల్చర్ డైరెక్టర్ గా బి. గోపిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాగా ఆమ్రపాలి గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసి ప్రభుత్వ పథకాలను పేదలకు అందేలా కృషి చేసింది. ఎంతో ప్రతిభ కలిగిన ఈమె డిప్యూటేషన్ మీద కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. 2020 నుంచి పీఎంఓ ఆఫీసులో డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. మరి ఆమ్రపాలిని హెచ్ఎండీఏ కమిషనర్ గా నియమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments