Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు

హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 కార్లు కాలి బూడిదయ్యాయి. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 కార్లు కాలి బూడిదయ్యాయి. ఆ వివరాలు..

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అగ్ని ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతుంది. మండే భానుడు.. అగ్ని దేవుడిని ఆకర్షిస్తాడేమో తెలియదు కానీ వేసవిలో మాత్రం అగ్ని ప్రమాదాల సంఖ్య భారీగా ఉంటుంది. కొన్ని సార్లు వీటి వల్ల ప్రాణనష్టం సంభవిస్తే.. చాలా సందర్భాల్లో మాత్రం ఊహించని రీతిలో ఆస్తి నష్టం వాటిల్లుతుంది. కోట్ల రూపాయల విలువైన సొత్తు అగ్నికి ఆహుతై.. బూడిద మిగులుతుంది. ఇక తాజాగా భాగ్యనగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన వల్ల లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఎందుకంటే ప్రమాదంలో 16 కార్లు బూడిదయ్యాయి. దాంతో భారీ ఆస్తి నష్టం ఏర్పడింది. ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ.. భాగ్యనగర వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వేసవి ప్రారంభం అయిన దగ్గర నుంచి నగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి. ప్రమాదాలను నివారించడానికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ముంద జాగ్రత్తలు పాటించినా సరే.. అగ్ని ప్రమాదాలు మాత్రం ఆగటం లేదు. ఇక తాజాగా.. హైదరాబాద్ యూసఫ్‌గూడలో మంగళవారం తెల్లవారుఝామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే ‘నాని కార్స్‌’ గ్యారేజీలో ఈ అగ్ని ప్రమాదం వెలుగు చూసింది. ఘటన చోటు చేసుకున్న గ్యారేజీలో మెుత్తం 20 కార్లు ఉండగా.. వాటిల్లో 16 కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. దాంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కార్‌ గ్యారేజీ పక్కనే పక్కనే నివాస భవనాలు ఉండటంతో.. మంటలు అటు వ్యాపించి.. వాటికి అంటుకోకుండా నివారణ చర్యలు తీసుకున్నారు. 20 కార్లలో 16 కార్లు కాలి బూడిదవ్వగా.. మరో నాలుగు కార్లకు నిప్పంటుకోకుండా అగ్ని మాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్ని మాపకశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీసే పనిలో ఉన్నారు.

ఇక కొన్ని రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లాలోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్ పక్కనే ఉండే 5 దుకాణాలు అగ్ని ఆహుతయ్యాయి. రాత్రి సమయంలో ప్రమాదం జరగటంతో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

Show comments