New Year 2024: న్యూ ఇయర్: ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్! ఆ దారులు అన్నీ క్లోజ్!

న్యూ ఇయర్: ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్! ఆ దారులు అన్నీ క్లోజ్!

New Year 2024: నూతన సంవత్సర వేడుకలకు యువత సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు.

New Year 2024: నూతన సంవత్సర వేడుకలకు యువత సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు.

నాలుగు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టనున్నాము. పాత ఏడాదికి బై..బై చెబుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు యువతపెద్ద ఎత్తున ఏర్పాట్లు, ప్రణాళిక రచిస్తుంది. అలానే హైదరాబాద్ నగర ప్రజలు కూడా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. డీజే పాటలు, హుషారెత్తే డ్యాన్సులు, మందు, విందు, చిందు ఇలా అన్నింటికి పక్కగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక న్యూయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ, అసాంఘిక ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా హైదారాబాద్ ట్రాఫిక్ పోలీసులు న్యూ ఇయర్ సందర్భంగా  కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

దేశమంతా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతోంది. డిసెంబరు 31వ తేదీ రాత్రి నుంచే వేడుకలకు అన్ని హోటళ్లు, పబ్ లు సిద్ధం చేస్తున్నాయి. ప్రవేటు సంస్థలు కూడా వేడుకలను నిర్వహించేందుకు పూనుకుంటున్నాయి. ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా టిక్కెట్లను అమ్మే ప్రక్రియను ప్రారంభించాయి. ఇలా అన్ని నగరాలతో పాటు హైదరాబాద్ నగరం కూడా న్యూ ఇయర్ కోసం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని పరిమితులతో పాటు మార్గదర్శకాలను జారీ చేసింది.

న్యూ ఇయర్ రోజు నగరంలోని కొన్ని రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు  ప్రవేశం లేదు. అలానే పీవీఎన్ఆర్ ప్లైఓవర్ కూడా  వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదు. అలానే శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు, షేక్ పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్,  సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్,  ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్) వద్ద  31వ తేదీ రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసి వేస్తారు.

క్యాబ్, ఇతర వాహనాల ఆపరేటర్లు విషయంలోనూ హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు.  క్యాబ్, ఆటోలు వంటి వాహనాల డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలి. అంతేకాక వారికి సంబంధించిన అన్ని డాక్యూమెంట్స్ వెంట ఉంచుకోవాలి. క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితులలోను రైడ్ నిరాకరించకూడదు. ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే వాహనం నెంబర్, సమయం, ప్రదేశం మొదలైన వివరాలతో వాట్సాప్ 9490617346 కు ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేయకూడదు.

అలానే బార్, పబ్, క్లబ్లులు వంటి వాటికి కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. బార్,పబ్,క్లబ్ మొదలైనవి, తమ ప్రాంగణంలో మద్యం సేవించిన వారిని వాహనాలు నడపడానికి అనుమతిస్తే, నేరాన్ని ప్రోత్సహించినందుకు సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకోబడును. మద్యం తాగిన వ్యక్తులు తమ ప్రాంగణంలో వాహనం నడపకుండా ఆపాలి. డ్రైవింగ్ సమయంలో ప్రమాదకర ఉల్లంఘనలు చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు అమర్చడం జరిగింది. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాము. సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారులపై రాత్రి 8 గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ పై విస్తృత తనిఖీలు నిర్వహిస్తారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. వాహనాలలో అధిక సౌండ్, మ్యూజిక్ సిస్టమ్లను ఉపయోగించడం ఉపయోగించ కూడదు.

మద్యం తాగి వాహనం నడిపే ప్రతి ఒక్కరిపై  మోటార్ వెహికల్స్ యాక్ట్, ఇతర సెక్షన్ల  కేసు బుక్ చేయబడతాయి. తొలి నేరానికి జరిమానా రూ. 10 వేలు  జరిమానా లేదా  6 నెలల వరకు జైలు శిక్ష విధించ పడుతుంది. అలానే రెండవ లేదా అంతకంటే ఎక్కువసార్లు నేరానికి పాల్పడితే  రూ. 15 వేలు లేదా  2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అంతేకాక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. ఇంకా, మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ఎవరైనా రోడ్డు ప్రమాదానికి పాల్పడి,  మరణానికి కారణమైనట్లయితే, క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుంది మరియు అరెస్టు చేసి జైలుకు పంపబడును. ఇలా న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ సీపీ మార్గదర్శకాలను, సూచలను జారీ చేసింది. మరి.. హైదరాబాద్ పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments