బ్రాండ్ అంబాసిడర్లుగా రకుల్‌ను, సమంతను, మంచు లక్ష్మిని ప్రకటించినప్పడు ఆ సోయి లేదా KTR

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాట కంపోజింగ్ బాధ్యతలను ఎంఎం కీరవాణికి అప్పగించడం దుమారం రేపింది.

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాట కంపోజింగ్ బాధ్యతలను ఎంఎం కీరవాణికి అప్పగించడం దుమారం రేపింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి అధికారం చేపట్టింది కాంగ్రెస్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల టీఎస్ ను టీజీగా మార్చుతూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా టీఎస్ ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తెలంగాణ అధికార చిహ్నం, రాష్ట్ర గీతంపై కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా జయ జయహే తెలంగాణ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది.

తెలంగాణ అధికార గీతం “జయ జయహే తెలంగాణ”కు స్వరకల్పన చేసేందుకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణికి బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ అధికారిక గీతానికి ఆంధ్రా మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించడమేంటని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. జయ జయహే తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి కనీసం జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని విమర్శించారు. నేడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామంటే కేసీఆర్, కేటీఆర్ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారన్నారని ఫైర్ అయ్యారు. ఈ గీతాన్ని ఎంఎం కీరవాణి కంపోజ్ చేస్తే.. అతన్ని ఆంధ్ర మూలాలున్న వ్యక్తిగా కేసీఆర్, కేటీఆర్ విమర్శిస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరి గతంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర కోడలైన సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా, ఆంధ్రా అమ్మాయి మంచు లక్ష్మిని తెలంగాణ స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా.. తెలంగాణకు ఏమాత్రం సంబంధంలేని నటి రకుల్ ప్రీత్ సింగ్‌ని బాలిక విద్యకు బ్రాండ్ అంబాసిడర్‌గా కేటీఆర్ నియమించినప్పుడు తెలంగాణ సోయి గుర్తుకు రాలేదా అంటూ ఆది శ్రీనివాస్ నిలదీశారు. యాదాద్రి ఆర్కిటెక్ట్‌గా ఆంధ్ర సాయిని నియమించినప్పుడు తెలంగాణ పౌరుషం ఎక్కడికి పోయిందంటూ ప్రశ్నించారు. అప్పుడు లేని తెలంగాణ సోయి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ ప్రశ్నించారు.

Show comments