కల్నల్‌ సంతో‌ష్ బాబు కుటుంబం కోసం GHMC కీలక నిర్ణయం! ఏంటో తెలుసా?

Colonel Santhosh Babu: భారత సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా సైనిక బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో తెలుగు తేజం కల్నల్ సంతోష్‌తో పాటు ఇద్దరు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

Colonel Santhosh Babu: భారత సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా సైనిక బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో తెలుగు తేజం కల్నల్ సంతోష్‌తో పాటు ఇద్దరు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

దేశ రక్షణ కోసం ఎంతోమంది జవాన్లు తమ ప్రాణాలు తృణప్రాయంగా త్యాగం చేస్తుంటారు.  2020లో లడాఖ్ సరిహద్దులో ఉన్న గల్వాన్ లోయలో చైనా దురాక్రమణను తిప్పికొట్టే క్రమంలో వీరమరణం పొందినవారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కర్నల్ సంతోష బాబు ఒకరు. ఈ సంఘటనలో ఆయనతో పాటు మరికొంత మంది జవాన్లు అమరవీరులయ్యారు. తన తండ్రి కన్న కల కోసం బ్యాంక్ ఉద్యోగం మాని సైన్యంలో చేరారు. ఈ క్రమంలోనే లడాఖ్ వద్ద చైనా సైనికులు దొంగ దెబ్బ తీసి భారత సైనికులపై విరుచుకు పడ్డారు.. వారి దురాక్రమణను తిప్పి కోట్టే నేపథ్యంలో సంతోష్ బాబు సహ మరికొంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.తాజాగా కర్నల్ సంతోష్ బాబు కోసం జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

కోట్ల మంది భారతీయుల ప్రాణ రక్షణ కోసం సరిహద్దుల్లో సైన్యం నిరంతరం పహారా కాస్తూ ఉంటుంది. క్లిష్టమైన వాతావరణం, కఠినమైన ప్రాంతంలో దేశ సరిహద్దులను పహాకా కాస్తు తమ ప్రాణాలు సైతం లెక్కచేయరు జవాన్లు. 2020, జూన్ 15న లడాక్ సరిహద్దుల్లో గల గల్వాన్ లోయలో చైనా దురాక్రమణను తిప్పి కొట్టే ప్రయత్నంలో జరిరిగిన భీకరమైన పోరులో తెలంగాణ చెందిన కర్నల్ సంతోష్ బాబు అమరవీరుడయ్యాడు. ఆయనతో పాటు 20 మంది భారత సైనికులు అమరవీరులయ్యారు. చైనా వైపు నుంచి 35 మంది సైనికులు కన్నుమూశారు.. వారి బాడీలను స్ట్రెచర్లపై తీసుకువెళ్లారు. అప్పట్లో ఈ ఘటన తర్వాత కర్నల్ సంతోష్ బాబు పేరు యావత్ భారత దేశం మొత్తం మారు మోగింది.

ఆయన త్యాగాన్ని భారతీయులు ఎంతో గొప్పగా పొగిడారు. మాజీ సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి రూ.5 కోట్లు నగదు, ఆయన సతీమణికి సంతోషికి గ్రూప్ – 1 స్థాయి ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులను అందజేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఇంటి స్థలం పత్రాలకు కూడా అందజేశారు. తాజాగా కర్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డ నెంబర్ – 14 లో 711 చదరపు గజాల స్థలం కేటాయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. గురువారం స్టాండింగ్ కమిలీ సమావేశంలో టేబుల్ ఎజెండాగా ఈ అంశాన్ని అందరు సభ్యులు ఆమోదించడం జరిగింది.

Show comments