TS ను TG గా మార్చుతూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

Telangana Government: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Telangana Government: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల పై తొలి సంతకం చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం కూడా మొదలు పెట్టారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం ఉండనుంది. సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై ఉండే టీఎస్ (TS) అని కాకుండా టీజీ (TG) గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనంపై ‘టీఎస్’ అని రాస్తున్నారు. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం రాకముందు.. వచ్చిన కొత్తలో అందరూ ‘టీజీ’ అనే అక్షరాలతోనే రిజిస్ట్రేషన్ రాసి ఉంచేవారు.. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్థానంలో తెలంగాణ స్టేట్ ని సూచించేలా ‘టీఎస్’ అనే అక్షరాలు అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలకు ‘టీజీ’ అనే అప్రూవల్ ఇచ్చింది. కానీ గత ప్రభుత్వం మాత్రం ‘టీఎస్’ గా మార్పు చేసింది. ఇదే అంశంపై కేబినెట్ లో చర్చలు జరిపి టీఎస్ స్థానంలో టీజీ ఉండాలని.. ఇకపై ఏ వాహనాల రిజిస్ట్రేషన్ తో పాలు ఏదైనా ‘టీజీ’గానే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్ర గేయంగా ‘జయ జయహే తెలంగాణ’ అని నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ భేటీలో కేబినెట్ల పలు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  అలాగే ఆరు గ్యారెంటీల అమలు విషయంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు హామీలు అమలు అవుతున్నాయి.. మరో నాలుగు హామీల అమలుపై చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. వీటిలో ముఖ్యమైనది రాష్ట్రంలోని నివసించే వారికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్ ఇవ్వాలనే ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కుల గణన నిర్వహంచాలని తీర్మానించిట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments