విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. మరో వినూత్న పథకం.. దసరా నుంచే అమలు

సీఎం కేసీఆర్ పాఠశాల విద్యార్థులకు శుభవార్తను అందించారు. వారి కోసం ఓ వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెడుతూ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు ఆ విధమైన కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికి అవసరమైన నిధులను కేటాయిస్తూ ఖర్చుచేస్తుంది. పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఈ క్రమంలో మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ వివరాలు మీకోసం.

స్కూల్లలో చదువుతున్న విద్యార్థలకు అల్పాహారం అందించేందుకు సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికి బ్రేక్ ఫాస్ట్ ను అందించనుంది. కాగా ఈ పథకాన్ని దసరా పండుగను పురస్కరించుకుని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. నాణ్యమైన భోదనతో పాటు పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. పెరుగుతున్న ఖర్చులు, అరకొర ఆదాయంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసిన సీఎం కేసీఆర్ అల్పాహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments