రెండు తెలుగు రాష్ట్రాల్లో చేప మందు ప్రసాదం పంపిణీ ద్వారా జనాల్లో ప్రాచూర్యం పొందారు బత్తిని హరినాథ్ గౌడ్. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం(ఆగస్టు 24) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. దమ్ము, దగ్గు, ఆస్తమాకు ప్రతి సంవత్సరం మృగశిర రోజు చేప మందు పంపిణీ చేస్తారు. కాగా..బత్తిని హరినాథ్ గౌడ్ తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. హైదరాబాద్ లో వీరి కుటుంబం 150 ఏళ్లకు పైగా చేప మందును పంపిణీ చేస్తూ వస్తోంది.
బత్తిని సోదరులు అయిన హరినాథ్ గౌడ్, గౌరిశంకర్ లు చేప మందుకు ప్రసిద్దిగాంచారు. మృగశిర రోజున ప్రతి సంవత్సరం ‘బత్తిని మృగశిర ట్రస్ట్’ ద్వారా ఆస్తమా రోగులకు చేప మందును పంపిణీ చేస్తారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతి ఏడాది ఈ చేప మందును పంపిణీ చేస్తారు. ఈ చేప ప్రసాదం కోసం వేలల్లో జనాలు వస్తారు. ఇలా ఉచితంగా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ మరణించాడన్న విషయం తెలిసి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షిణించడంతో.. గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.
ఇదికూడా చదవండి: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. హోటల్ మేనేజర్ మృతి