Nidhan
Rishabh Pant Captaincy Controversy: టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇప్పుడు దులీప్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. లాంగ్ ఫార్మాట్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
Rishabh Pant Captaincy Controversy: టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇప్పుడు దులీప్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. లాంగ్ ఫార్మాట్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
Nidhan
టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఇప్పుడు మరో టోర్నమెంట్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల వైట్ బాల్ క్రికెట్లో రచ్చ చేస్తూ వచ్చిన అతడు.. ఇప్పుడు రెడ్ బాల్ ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీలో పరుగుల వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు పంత్. అయితే ఈ టోర్నమెంట్లో అతడ్ని ప్లేయర్‌గా మాత్రమే తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు తరఫున 33 టెస్టులు ఆడిన పంత్‌ను కాదని.. డొమెస్టిక్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్‌కు దులీప్ ట్రోఫీ టీమ్‌లో కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. దీంతో భారత క్రికెట్ బోర్డుపై విమర్శలు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పంత్ వివాదంపై తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రియాక్ట్ అయ్యాడు. దులీప్ ట్రోఫీలో అతడ్ని కేవలం ప్లేయర్‌గా ఆడించడం, సారథ్య బాధ్యతలు అప్పగించకపోవడం సరికాదన్నాడు. ఇది పంత్‌ను అవమానించడమేనని.. అతడ్ని బచ్చా ప్లేయర్‌గా చూస్తున్నారని సీరియస్ అయ్యాడు. ‘రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించలేదు. అతడు ఎంపికైన టీమ్-బీకి అభిమన్యు ఈశ్వరన్‌ను సారథి చేశారు. పంత్ టెస్ట్ కెప్టెన్సీకి పనికిరాడా? నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. పంత తన బెస్ట్ ఇచ్చింది టెస్టుల్లోనే. లాంగ్ ఫార్మాట్లో బాగా ఆడి అతడు క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటోడ్ని అదే ఫార్మాట్ మ్యాచులకు కెప్టెన్ చేయకపోవడం షాకింగ్‌గా ఉంది’ అని ఆకాశ్ చోప్రా విస్మయం వ్యక్తం చేశాడు.
ఇక, కొత్త కోచ్ గౌతం గంభీర్ రాకతో భారత క్రికెట్లో పలు మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. టీ20లు, వన్డేలకు శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 సారథ్య పగ్గాలు అప్పగించారు. వన్డేలు, టెస్టుల్లో రోహిత్ శర్మను కెప్టెన్‌గా కంటిన్యూ చేస్తున్నారు. దీంతో టెస్టులకు ఎవర్ని వైస్ కెప్టెన్ చేస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. జస్ప్రీత్ బుమ్రా, పంత్‌లో ఒకరికి ఈ రోల్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ దులీప్ ట్రోఫీ టీమ్స్‌లో ఒక టీమ్‌కు గిల్, మరో రెండు టీమ్స్‌కు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్స్‌గా నియమించారు. కానీ పంత్ ఉన్న జట్టుకు అతడ్ని కాదని అభిమన్యుకు సారథ్యం ఇచ్చారు. దీంతో ఇన్‌డైరెక్ట్‌గా టెస్టుల్లో పంత్‌కు వైస్ కెప్టెన్సీ దక్కదనే ఇండికేషన్స్ ఇచ్చారని అంటున్నారు. దీని పైనే ఆకాశ్ చోప్రా పైవిధంగా రియాక్ట్ అయ్యాడు. మరి.. దులీప్ ట్రోఫీలో పంత్‌ను కేవలం ఆటగాడిగానే సెలెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Akash Chopra “Rishabh Pant is not a captain.He has been selected in Abhimanyu Easwaran’s team,Is Pant not even a candidate for Test captaincy?I am a little surprised, not aligned with this because best avatar of Pant you have seen is as a Test cricketer”pic.twitter.com/bxchTIMVZF
— Sujeet Suman (@sujeetsuman1991) August 15, 2024