మా టీంలో అడుగులు సరిగా పడని బౌలర్ ఉన్నాడు: ద్రవిడ్

  • Author Soma Sekhar Published - 08:35 PM, Sat - 4 November 23

భారత జట్టులో అడుగులు సరిగా పడని 6వ బౌలర్ ఉన్నాడని, త్వరలోనే అతడు బౌలింగ్ వేయడం చూస్తామని చెప్పుకొచ్చాడు ద్రవిడ్.

భారత జట్టులో అడుగులు సరిగా పడని 6వ బౌలర్ ఉన్నాడని, త్వరలోనే అతడు బౌలింగ్ వేయడం చూస్తామని చెప్పుకొచ్చాడు ద్రవిడ్.

  • Author Soma Sekhar Published - 08:35 PM, Sat - 4 November 23

వరల్డ్ కప్ 2023లో టీమిండియా పక్కా ప్రణాళికలతో దూసుకెళ్తోంది. ఈ విశ్వసమరంలో వరుసగా 7 మ్యాచ్ లకు గాను 7 గెలిచి.. సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఇటు బ్యాటింగ్ లోనూ.. అటు బౌలింగ్ లోనూ సత్తా చాటుతూ ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తోంది భారత జట్టు. ప్రస్తుతం టీమిండియా 5 రెగ్యూలర్ బౌలర్లలతో బరిలోకి దిగుతూ అనుకున్న ప్రకారమే తన ప్లాన్స్ ను అమలుపరుస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే 6వ బౌలర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. భారత జట్టులో అడుగులు సరిగా పడని 6వ బౌలర్ ఉన్నాడని, త్వరలోనే అతడు బౌలింగ్ వేయడం చూస్తామని చెప్పుకొచ్చాడు ద్రవిడ్.

బుమ్రా, షమీ,సిరాజ్, కుల్దీప్, జడేజా ప్రస్తుతం టీమిండియా వరల్డ్ కప్ లో రెగ్యూలర్ గా ఉపయోగిస్తున్న బౌలర్లు. పాండ్యా గాయంతో దూరం కావడంతో.. 6వ బౌలర్ ఎవరు? అనే ప్రశ్న కొంతమందిలో మిగిలిఉంది. ఈ ప్రశ్నకు తాజాగా సమాధాం ఇచ్చాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. రెవ స్పోర్ట్స్ తో ద్రవిడ్ మాట్లాడుతూ..”ప్రస్తుతం భారత జట్టుకు 6వ బౌలర్ అవసరం అంతగా లేదు. మరీ అంతగా అతడి అవసరం ఉంది అనుకుంటే.. టీమిండియాలో అడుగులు సరిగ్గా పడని ఓ బౌలర్ ఉన్నాడు. అతడు బౌలింగ్ వేయాలని గత మ్యాచ్ లో ఫ్యాన్స్ నినాదాలు కూడా చేశారు. త్వరలోనే అతడిని బౌలర్ గా చూడొచ్చు” అంటూ విరాట్ కోహ్లీ గురించి సరదాగా చెప్పుకొచ్చాడు టీమిండియా వాల్.

కాగా.. కోహ్లీ బౌలింగ్ రన్నప్ చూస్తే ఎక్కడ అతడి కాళ్లకు అతడి కాళ్లే తగిలి కిందపడిపోతాడో అని ప్రాక్టీస్ సమయంలో టీమ్ సభ్యులు మాట్లాడుకుంటారని ద్రవిడ్ తెలిపాడు. ఈ విషయాన్ని ఒకసారి అతడే స్వయంగా చెప్పాడు కూడా. అయితే తన రాంగ్ ఫుట్ స్టెప్ విషయాన్ని సరదాగా తీసుకున్నట్లు విరాట్ తెలిపాడు. మరి విరాట్ కోహ్లీ బౌలింగ్ యాక్షన్ గురించి ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments